Begin typing your search above and press return to search.

రానాను బ్రో అనేసిన స్వీటీ.. అందరికీ సర్ ప్రైజ్!

By:  Tupaki Desk   |   13 May 2020 6:15 AM GMT
రానాను బ్రో అనేసిన స్వీటీ.. అందరికీ సర్ ప్రైజ్!
X
టాలీవుడ్ లో ఉన్న హ్యండ్సమ్ యాక్టర్లలో ఒకరైన రానా దగ్గుబాటి నిన్న తన ప్రేమ సంగతి చెప్పి ఒక్కసారిగా అందరిని సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. రానాకు ఇంటర్వ్యూలలో రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న 'మీ పెళ్లెప్పుడు?' ఇక ఎవరూ ఆ ప్రశ్న అడిగే అవసరం రానివ్వకుండా అమ్మాయిని అందరికీ పరిచయం చెయ్యడంతో అభినందనలు.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మిహికా బజాజ్ తనకు 'యస్' చెప్పిందని ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ రానా పెట్టిన పోస్ట్ కు అటు సెలబ్రిటీల నుండి.. ఇటు సాధారణ నెటిజెన్ల నుండి భారీ స్పందన దక్కింది. సమంతా సరదాగా "డెడ్.. డైడ్" అంటూ రిప్లై ఇచ్చింది. ఇక మరో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి "కంగ్రాచులేషన్స్ బ్రో& మిహికా బజాజ్. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. మీ పై ఎల్లపుడూ మేమందరం ప్రేమ కురిపిస్తూనే ఉంటాం" అంటూ అభినందనలు తెలిపింది. రానాను అనుష్క బ్రదర్ అని పిలవడం చాలామందిని ఆకర్షించింది.

'బాహుబలి' చిత్రం కోసం రానా.. అనుష్క.. ప్రభాస్ లు దాదాపు ఐదేళ్ళు సమయం వెచ్చించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ప్రభాస్ - అనుష్క రిలేషన్ పై ఇప్పటికే లవ్ ఎఫైర్ అంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ 'అదేం లేదు' అంటూ కొట్టిపారేస్తూనే ఉన్నారు. ఇక రానా-ప్రభాస్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. నిజానికి ప్రభాస్-అనుష్క రిలేషన్ గురించి అసలు నిజం రానాకు తెలుసని ఎప్పుడో రూమర్లు వచ్చాయి. అయితే అవన్నీ పక్కన పెడితే రానా - అనుష్కల బ్రదర్ సిస్టర్ బాండ్ అందరినీ ఆకట్టుకుంటోంది.