Begin typing your search above and press return to search.

'గోవాలో త్రిషను, తన హబ్బీని కలిశాను' -రానా

By:  Tupaki Desk   |   21 Jan 2015 4:50 AM GMT
గోవాలో త్రిషను, తన హబ్బీని కలిశాను -రానా
X
అందాల త్రిష ఓ ఇంటిదైపోతోంది. చెన్నయ్‌ వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్‌ మణియన్‌ని వివాహమాడేస్తోంది. త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమం చేయనున్నారు. అయితే ఇంతలోనే ఈ భామతో తన స్నేహం గురించి రానా పెదవి విప్పాడు. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్యా ప్రేమయణానికి బ్రేకప్‌ అయ్యిందని వార్తలొచ్చాయి. ముంబైలో 'బేబి' సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న రానాని ఇదే విషయమై ప్రశ్నిస్తే ..

ఈ విషయంపై ఇదివరకే క్లారిటీ ఇచ్చాను. త్రిష ఓ మంచి స్నేహితురాలు మాత్రమే. తనతో లింకప్‌కి సంబంధించి వచ్చిన వార్తలన్నీ పుకార్లు మాత్రమే. ఓ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలోనూ ఇదే చెప్పాను. అయితే సదరు పత్రిక మళ్లీ తప్పుగానే వార్తను ప్రచురించింది. సుదీర్ఘ మంతనాలన్నీ వృథా. పదే పదే ఈ విషయాన్ని అడిగినా ఒకటే సమాధానం. త్రిష స్నేహితురాలు మాత్రమే. ఇటీవలే గోవాలో తనని, తనకు కాబోయే శ్రీవారు వరుణ్‌ మణియన్‌ని కలిశాను... అని చెప్పాడు. ప్రస్తుతానికి నేను సింగిల్‌. అమ్మాయితో ప్రేమాయణానికి సమయం, సందర్భం కలిసిరావాలి.. అని ముక్తాయించాడు. ఇప్పటికైనా రానా చెప్పేది నమ్మండి ప్లీజ్‌!