Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ పెయిర్..!

By:  Tupaki Desk   |   23 Dec 2020 7:07 AM GMT
టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ పెయిర్..!
X
ఇటీవ‌ల వ‌రుస‌గా యువ‌హీరోలంతా వ‌ల‌చిన భామ‌ను పెళ్లాడేసి లైఫ్ లో సెటిలైపోయారు. నిఖిల్.. నితిన్ .. రానా .. ఇలా ఒక్కొక్క‌రి పెళ్లికి ఈ లాక్ డౌన్ పెద్ద‌ సొల్యూష‌న్ చూపించింది. మొత్తానికి ఎవరికి వారు సంసార సాగ‌రంలో దిగిపోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇక రానా ద‌గ్గుబాటి త‌న సోద‌రి(వెంకీ కుమార్తె) స్నేహితురాలిని పెళ్లాడి స‌ర్ ప్రైజ్ చేశారు. మిహీక బ‌జాజ్ తో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్.. ఆ క్ర‌మంలోనే అంద‌మైన జంట ల‌వ్ స్టోరి గురించి భ‌ళ్లాల దేవ ఫ్యాన్స్ ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకున్నారు.

రానా- మిహీకా చూడ‌ముచ్చ‌టైన జంట అంటూ కితాబు అందుకున్నారు. ఇక టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ పెయిర్ గానూ ఆ ఇద్ద‌రూ పాపుల‌ర‌వుతున్నారు. తాజా ఎయిర్ పోర్ట్ లుక్ చూశాక ఈ మాట‌ను ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే. పాప్డ్ లుక్ తో స్టైలిష్ ఎయిర్ పోర్ట్ లుక్ ఇది. మిహీకా తెల్లటి చొక్కా నీలిరంగు జీన్స్‌లో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. త‌న‌ నడక న‌డ‌త‌ స్టైలిష్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆమె వెనుక గా హ‌బ్బీ రానా ఎంతో స్టైలిష్ గా క‌నిపించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఇటీవ‌ల అరుదైన‌ దృశ్య‌మిది. ఖాకీ చొక్కాతో నల్లటి టీ-షర్టును ధరించి బూడిదరంగు ప్యాంటుతో రానా స్టైలిష్ గా క‌నిపిస్తున్నారు. అతని కళ్ళపై ఆ షేడ్స్ ప‌ర్ఫెక్ట్ కాంబినేష‌న్ టోపీ అతన్ని మరింత స్టైలిష్ గా చూపించాయి. ఈ జోడీ ప‌ర్ఫెక్ట్ పెయిర్ అంటే అతిశ‌యోక్తి కాదేమో!