Begin typing your search above and press return to search.
అది ఫ్యాన్ మేడ్ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్..!
By: Tupaki Desk | 24 July 2020 2:12 PM GMTటాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను ప్రేమించిన రానా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో వీరి పెళ్ళికి అంగీకరించిన ఇరు కుటుంబాలు ఇటీవల దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్ ల రోకా వేడుకను కూడా నిర్వహించారు. ఇక ఆగస్టు 8న శుభముహూర్తాన రానా - మిహీకాల వివాహ వేడుక జరగనుంది.
కాగా తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8న రానా - మిహిక ల పెళ్లి వేడుక జరగనుందని పేర్కొంటూ ఓ పెళ్లి పత్రిక వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ లో 'మాయాబజార్' లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా - మిహీకాల ఫొటోలతో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు కాజాగూడ చైతన్య ఎన్క్లేవ్ (మణికొండ)లో ఈ వివాహం జరగనుందని వెల్లడించారు. రానా డిజిటల్ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ నిజమైంది కాదని తెలుస్తోంది. దగ్గుబాటి రానా ఫ్యాన్స్ తమ హీరో పట్ల అభిమానాన్ని చాటుకోడానికి రూపొందించిన ఫ్యాన్ మేడ్ డిజిటల్ వెడ్డింగ్ కార్డు అని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఆగస్టు 8న రానా - మిహీకాల వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా వివాహ వేడుక నిర్వహించబోతున్నారట. ఇక ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది.