Begin typing your search above and press return to search.
భీమ్లా ఈవెంట్ లో రానా కటౌట్ మిస్సింగ్?
By: Tupaki Desk | 24 Feb 2022 4:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషించిన భీమ్లా నాయక్ ఈనెల 25న అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-హిందీలో భారీగా విడుదల చేస్తున్నారు.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ 2ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ వర్సెస్ రానా దుమారం మాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ గా మారింది.
పవన్ పాత్రకు ధీటుగా రానా పాత్రను కూడా తీర్చిదిద్దారని అర్థమైంది. కానీ ఎందుకనో టైటిల్ సహా ప్రమోషన్ మెటీరియల్ లో రానా పాత్రను తగ్గించేందుకే టీమ్ ప్రయత్నించిందని విమర్శలొచ్చాయి.
తాజా ఈవెంట్లోనూ రానా ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించలేదు. అతని ఫ్లెక్సీ లేదా మినీ కటౌట్ లేకపోవడం ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ కటౌట్ పక్కన నిర్మాత నాగ వంశీ కటౌట్ పెట్టారు కానీ రానా కటౌట్ ని హైలైట్ చేయలేదు. మాటల రచయిత త్రివిక్రమ్.. సంగీత దర్శకుడు థమన్ కటౌట్లను పవన్ కళ్యాణ్ చిత్రం పక్కన హైలైట్ చేయగా.. దర్శకుడు సాగర్ చంద్ర కటౌట్ ను వేరే మూలలో ఉంచారు. ఈవెంట్ లో కనిపించినా కానీ రానా ఫ్లెక్సీని పూర్తిగా లేకుండా చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించగా.. దర్శకుడికి అంతగా ప్రాధాన్యతనివ్వకుండా ప్రమోషన్స్ లో దాచేయడం ఏమిటో కూడా అర్థం కాలేదని విమర్శలొస్తున్నాయి.
నిజానికి ట్రైలర్ 2లో పవన్ కళ్యాణ్ పాత్ర కంటే రానా బాగా కనిపించాడని చాలా మంది ప్రశంసిస్తున్నారు. కానీ ప్రమోషన్స్ లో మాత్రం రానాను దాచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిత్యామీనన్ పాత్ర మరో హైలైట్ గా నిలవనుందని ట్రైలర్ చెబుతోంది.
ఏది ఏమైనా కానీ కొన్ని మానవ తప్పిదాలను ఎర్రర్స్ లేదా మనస్తత్వాలను కూడా ఈ ఈవెంట్ ఆవిష్కరించిందన్నమాట.