Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో : ఎత్తిన బాటిల్ దించకుండా తాగేసిన కీర్తి సురేష్
By: Tupaki Desk | 23 March 2023 5:33 PM GMTనాని హీరోగా నటించిన దసరా సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దసరా సినిమా కోసం ప్రస్తుతం ముంబయిలో ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో నాని హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దసరా సినిమాలో నాని ఒక షాట్ లో ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాడు. ఆ హుక్ స్టెప్ ను చిత్రం ప్రమోషన్ లో భాగంగా నాని.. కీర్తి సురేష్ మరియు రానా లు చేశారు. రానా ఎత్తిన బాటిల్ పూర్తిగా అయ్యే వరకు దించకుండా ఉండలేకపోయాడు. కానీ నాని మరియు కీర్తి సురేష్ మాత్రం ఎత్తిన బాటిల్ దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కీర్తి సురేష్ కల్లు సీసాను దించకుండా మొత్తం తాగేసిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోకు తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఆ బాటిల్ లో ఉన్నది ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటివి చేస్తేనే జనాల దృష్టిని ఆకర్షించగలరు. అదే విషయాన్ని దసరా యూనిట్ సభ్యులు ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి వీడియోలు వైరల్ అయితేనే దసరా సినిమా జనాల్లోకి ఎక్కువగా రీచ్ అవుతుంది. కనుక ఇలాంటి వైరల్ వీడియోలు మరిన్ని వచ్చేలా ప్లాన్ చేయాలి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బజ్ తో పోల్చితే ఇతర భాషల్లో దసరా సినిమాకు కాస్త బజ్ తక్కువే ఉంది. అందుకే అక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యేలా పబ్లిసిటీ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.