Begin typing your search above and press return to search.
యంగ్ టాలెంట్స్ కోసం రానా కొత్త వేదిక!
By: Tupaki Desk | 12 Sep 2022 9:45 AM GMTటాలెంట్ వున్న వాళ్లు సినిమాల్లో అవకాశం పొందాలని రక రకాల దారులు వెతుకుటుంటారు. అలాంటి వారి వీక్ నెస్ ని క్యాస్ చేసుకుంటూ గతంలో చాలా మంది అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి.
అనుకున్న అవకాశం లభించక మోసగాళ్లని నమ్మి మోసపోయిన ఎంతో మంది ఆ అనుభవంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండానే ఇంటిదారి పట్టారు. కొంత మంది మాత్రం ఇప్పటికీ కాళ్ల చెప్పులు అరిగేలా పలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే వున్నారు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఫిల్మ్ నగర్ వీధుల్లోని సినిమా ఆఫీసుల చుట్టూ, స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వారికి హీరో రానా గుడ్ న్యూస్ చెబుతున్నారు.
అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ, సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదని చెబుతున్నారు. మారిన ట్రెండ్ కి అనుగుణంగా టాలెంట్ వుండి సరైన దారి లభించక ఎంతో సరైన వేదిక, సరైన సపోర్ట్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.
సరైన ప్లాట్ ఫామ్ లభిస్తే తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి హీరో దగ్గుబాటి రానా గుడ్ న్యూస్ చెబుతున్నారు. సినిమాల్లో తమ టాలెంట్ ని వివిధ శాఖల్లో చూపించాలని ఆశగా ఎదురుచూస్తున్న యంగ్ టాలెంట్స్ కోసం హీరో రానా 'క్వాన్' అనే టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థని స్టార్ట్ చేశాడట. ఇది ఇండస్ట్రీకి, న్యూ టాలెంట్ కి వారధిగా వుంటుందని తెలుస్తోంది.
అంతే కాకుండా టాలెంట్ వున్న వారికి మంచి అవకాశాల్ని అందించే వేదికగా మారుతుందట. టాలెంటెడ్ పీపుల్స్ ని ఇండస్ట్రీకి అందించే వేదికగా 'క్వాన్' పనిచేయనుందని, కొత్త వారికి అవకాశాల్ని అందించనుందని తెలుస్తోంది. హీరో రానా 'క్వాన్' పేరుతో చేస్తున్న ప్రయత్నం కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీకి ఏ స్థాయిలో పరిచయం చేయబోతోందన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.