Begin typing your search above and press return to search.
త్రిషతో రానా బ్రేకప్ కారణం
By: Tupaki Desk | 23 Dec 2018 4:36 PM GMTయువహీరో రానా - త్రిష ప్రేమాయణం గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో వేడెక్కించే చర్చ సాగిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదారేళ్ల క్రితం మాట అది. ఆ తర్వాత ఆ ఇద్దరిపైనా రకరకాల రూమర్లు షికారు చేశాయి. కొంత గ్యాప్ తర్వాత త్రిష ఓ బిజినెస్ మేన్ ని పెళ్లాడేందుకు సిద్ధమైంది. నిశ్చితార్థం అయ్యి, అటపై పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
అదంతా అటుంచితే.. నేటి సాయంత్రం స్టార్ వరల్డ్ లో కాఫీ విత్ కరణ్ షోలో రానాకి ఇదే చిక్కు ప్రశ్న ఎదురైంది. త్రిషతో చాలా కాలం పాటు డేటింగ్ చేశావ్ కదా.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని కరణ్ ప్రశ్నించారు. అయితే అందుకు రానా ఇచ్చిన సమాధానం చాలా డిప్లమ్యాటిక్. చాలా కాలం పాటు స్నేహంగా ఉన్నాం. అందువల్ల అందరూ అలా అనుకుని ఉండొచ్చు! అంటూ నవ్వేశాడు.
ఇక పెళ్లి ఎందుకు చేసుకోవు? అని కరణ్ ప్రశ్నిస్తే.. నా స్నేహితులు బన్ని - చరణ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు ఇక ఎవరికీ చిక్కరు దొరకరు. అందుకే నేను సింగిల్ ఫ్రెండ్స్ తోనే అడ్జెస్ట్ అవుతున్నా.. అని అన్నాడు. పెళ్లయితే పెళ్లాంతోనే కాపురం చేయాలి.. స్నేహితులు - సింగిల్ స్టాటస్ ఉండదు కాబట్టి, ఇక అలాంటి లైఫ్ ఎందుకులే అని పెళ్లాడలేదని అన్నాడు.