Begin typing your search above and press return to search.
అలాంటివి చేస్తేనే మనలోని సత్తా తెలుస్తుంది..!
By: Tupaki Desk | 19 Sep 2018 1:14 PM GMTటాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన రానా ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. బాహుబలి చిత్రం తర్వాత హిందీ నుండి పలు ఆఫర్లు రానా తలుపు తట్టాయట. అయితే ఆచి తూచి మాత్రమే సినిమాలను రానా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హిందీలో హాథీ మేరే సాథీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో రానా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మరో వైపు తెలుగులో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్టీఆర్’లో కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన రానా ‘ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ సినీ వర్గాల వారితో పాటు - ప్రేక్షకులను కూడా మెప్పించింది.
తాజాగా ఒక ఆంగ్ల మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రానా షేర్ చేసుకున్నాడు. ‘ఎన్టీఆర్’ చిత్రంపై ప్రస్తుతం తాను ఎక్కువ దృష్టి పెట్టాను. సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రియల్ లైఫ్ వ్యక్తుల పాత్రలు చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. కల్పిత పాత్రల కంటే వ్యక్తుల పాత్రల్లో నటించడం చాలా కష్టంతో కూడుకున్నది. అలాంటి పాత్రల్లో నటించినప్పుడే నటుడిగా మన సత్తా ఏంటో తెలుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు పాత్రను పోషించడంను ఒక ఛాలెంజ్ గా స్వీకరించాను అంటూ రానా చెప్పుకొచ్చాడు.
ఇక ‘కంచరపాలెం’ సినిమా తన మనసుకు నచ్చిన సినిమా అని, చాలా సహజత్వంతో కూడిన సినిమా అవ్వడం వల్ల చూసిన వెంటనే ఆ సినిమాను ప్రమోట్ చేయాలనిపించింది. అందుకే సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేయాల్సిందిగా నాన్నకు సూచించాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా రానా పేర్కొన్నాడు. వరుసగా సినిమాలు చేయడం కంటే, మంచి సినిమాలు చేయడంపైనే తన దృష్టి ఉందని ఈ సందర్బంగా రానా చెప్పుకొచ్చాడు.