Begin typing your search above and press return to search.

క‌మర్షియ‌ల్ హీరో కాలేక‌పోయాన‌ని అంగీక‌రించాడా?

By:  Tupaki Desk   |   12 Jun 2022 3:30 PM GMT
క‌మర్షియ‌ల్ హీరో కాలేక‌పోయాన‌ని అంగీక‌రించాడా?
X
అస‌లు క‌మ‌ర్షియ‌ల్ హీరో అంటే మీనింగ్?  క‌మ‌ర్షియ‌ల్ హీరోయిజం అంటే..? .. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైన జ‌వాబు ఏదీ లేదు. నిజానికి ఏ హీరో ప్ర‌జ‌ల్లో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటే ఆ హీరో క‌మ‌ర్షియ‌ల్ హీరో. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేసే.. మాస్ ఫాలోయింగ్ అసాధార‌ణంగా క‌లిగి ఉండే హీరోయిజాన్ని క‌మ‌ర్షియ‌ల్ హీరోయిజం అనొచ్చు. కానీ ఈరోజుల్లో ట్రెండ్ మారింది.

మునుప‌టిలా నెపోటిజం హీరోల‌కు ప‌ట్టంగ‌ట్టే రోజులు పోయాయి. హీరో ఎవ‌రు? అన్న‌ది కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. భాష ప్రాంతం అనే అస‌మాన‌త‌లు కూడా నెమ్మ‌దిగా చెరిగిపోతున్నాయి. సినిమా అనేది గ్లోబ‌ల్ మార్కెట్. అందువ‌ల్ల న‌ట‌వార‌సులే కాదు ఔట్ సైడర్స్ కి ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఒక్క‌ టాలీవుడ్ ని ప‌రిశీలిస్తే అస‌లు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగేస్తున్న డ‌జ‌ను మంది యువ‌హీరోలు మ‌న‌కు ఉన్నారు.

తాజాగా క‌మ‌ర్షియ‌ల్ హీరోయిజంపై రానా చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. నా వ‌ర‌కూ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ కాక‌పోవ‌డానికి చాలా కారాణాలు ఉన్నాయి.. అని రానా వ్యాఖ్యానించారు. నేను హీరోగా నటిస్తే.. నాకు సరిపడే విలన్‌ దొరకరు. నాతో ఫైట్ చేసే విలన్ నాకంటే తక్కువ ఎత్తు ఉంటారు. నాకు కథలు చెప్పాలనే ఆలోచన ఉంది కానీ.. హీరోగా కథలు చెప్పాలనే ఆలోచన లేదు! అని రానా త‌న వ్యూని చెప్పారు. త‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ హీరో కావాల‌ని లేద‌ని కూడా అన్నారు.

రొటీన్ సినిమా కథలు నచ్చవని కూడా రానా అన్నారు. హింస ఉండే క‌థ‌లు సినిమాలు న‌చ్చ‌వు. కథ క‌థ‌నంలో కొత్తదనం ఉండాలి. హిర‌ణ్య‌క‌సిపుడు అలాంటిదే. అది నా కమర్షియల్ సినిమా. రావణాసురుడు పాత్ర వేస్తే అది నాకు నాకు కమర్షియల్ సినిమా అని భావిస్తాను.. అని తెలిపారు.

హీరో- హీరోయిన్లు పాటలు చెట్టు పుట్టా వెంట‌ పాడుకోవడం నాకు నచ్చదు. అలాంటి సీన్లు వస్తే థియేట‌ర్ నుంచి బయటకు వచ్చేస్తాను. వాటిలో ప్రాక్టికాలిటీ ఉండదు అని అన్నారు. నాయిక‌ల్ని టీజ్ చేయ‌డం కూడా న‌చ్చ‌ద‌ని రానా తెలిపారు. హీరోలు హీరోయిన్లు పిచ్చి జోకులు వేస్తే అస‌లే న‌చ్చ‌ద‌ని కూడా అన్నారు. నా త‌ర‌హా ఆలోచ‌న‌లు వేరు రానా మాత్రమే చేయగలడు అనేది చేస్తాను.

ఈ కథను రానా మాత్రమే చేయగలడు అంటే.. అది నా జోనర్. నెగిటివ్ షేడ్స్ ఉండే ఎమోషనల్ పాత్రలు నాకు ఇష్టం... అని తెలిపారు. నేను ఏ పాత్రలో నటించినా హీరోలా అనిపిస్తే అది నా కమర్షియల్ సినిమా అని రానా దగ్గుబాటి తెలిపారు. అంతేకాకుండా నాకు కమర్షియల్ హీరోగా సెటిల్ కావాలనే ఆలోచన ఎప్పుడు లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఓవ‌రాల్ గా రానా ఆలోచ‌న ఏమిట‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. క‌మ‌ర్షియ‌ల్ హీరో అన్నదానికి మీనింగ్ కూడా దీనినుంచి క్యాచ్ చేయొచ్చు. రానా న‌టించిన విరాట‌ప‌ర్వం జూన్ 17న విడుద‌ల‌వుతోంది. ఈ చిత్రాన్ని ఇప్ప‌టికే వీక్షించిన యువహీరోల నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. సాయిప‌ల్ల‌వి తో పాటు రానా చ‌క్క‌ని పాత్ర‌లో న‌టించాడ‌ని అంతా ప్ర‌శంసిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో రానా బిజీగా ఉన్నారు.