Begin typing your search above and press return to search.
బాహుబలి ఓవర్.. టైమ్ ఫర్ లీడర్
By: Tupaki Desk | 4 Jun 2017 10:53 AM GMTబాహుబలి2 హంగామా దాదాపుగా పూర్తి కావచ్చేసింది. ఈ మూవీకి కలెక్షన్స్ దాదాపు అన్ని ఏరియాల్లో బాగా తగ్గాయి. ఫుల్ రన్ కలెక్షన్స్ లెక్క పెట్టుకునే సమయం సమీపించినట్లే కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త సినిమాల హంగామా పెరగడం చూస్తే.. బాహుబలి2 టైమ్స్ దాదాపు పూర్తయినట్లుగా చెప్పుకోవచ్చు.
సరిగ్గా ఇలాంటి టైమ్ చూసుకునే భల్లాలదేవుడు కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. బాహుబలి జోష్ ఉన్న టైంలో తన సినిమా గురించి ప్రకటన ఇచ్చినా.. పెద్దగా వర్కవుట్ కాదని భావించిన రానా.. ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. పొలిటికల్ లీడర్ గా రానా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. 'నా కొత్త సినిమా నేనే రాజు నేనే మంత్రి టీజర్ ను జూన్ 6న రిలీజ్ చేయబోతున్నాం. ఈ విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నా' అంటూ ట్వీట్ ద్వారా విషయం చెప్పేశాడు రానా. కేథరిన్ థ్రెసా.. నవదీప్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి తేజ దర్శకుడు.
'దర్శకుడు తేజ తెలివితేటలు నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇది కచ్చితంగా అందరినీ ఆలోచింప చేసే చిత్రం అవుతుంది' అన్నాడు రానా. మాహిష్మతి రాజ్యానికి పాలించిన రాజుగా చేసిన సినిమా హంగామా పూర్తయే సరికి.. ఇప్పటి సమాజంలో నాయకుడి పాత్రలో కనిపించే సినిమాను.. రానా సిద్ధం చేయడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/