Begin typing your search above and press return to search.

భళ్లాల దేవుడితో బాహుబలి పెద్దలు

By:  Tupaki Desk   |   18 Oct 2017 4:35 AM GMT
భళ్లాల దేవుడితో బాహుబలి పెద్దలు
X

సరైన పాత్ర దొరికితే ఏ రేంజిలో నటించగలగడో బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రతో నిరూపించుకున్నాడు హీరో రానా. కళ్లతోనే క్రౌర్యం చూపడంలో రానా నటనకు బోలెడు ప్రశంసలు దక్కాయి. దీంతో వైవిధ్యమైన పాత్రలు అతడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. అటు బాలీవుడ్ తో పాటు ఇటు కోలీవుడ్ లోనూ కథాబలం ఉన్న సినిమాల్లో రానాను ఏరికోరి తీసుకుంటున్నారు.

తాజాగా రానా వార్ బ్యాక్ డ్రాప్ లో తమిళంలో మదై తిరందు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాహుబలి సినిమా తర్వాత నాజర్ - సత్యరాజ్ వంటి బాహుబలి పెద్దలతో మరోసారి కలిసి నటించబోతున్నాడు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. మరికొన్ని రోజులు చిత్ర యూనిట్ అక్కడే ఉంటుంది. ఈ సందర్భంగా వీరు ముగ్గురూ ఒక షూటింగ్ స్పాట్ లో కనిపించడంతో బాహుబలి టీం రీ యూనియన్ లా ఉందనే కాంప్లిమెంట్లు వచ్చాయి. మదై తిరందు సినిమాలో రానా కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇందులో హీరోయిన్ గా రెజీనా కెసాండ్రా నటిస్తోంది. ఈ మూవీని తెలుగులో 1945 పేరుతో డబ్బింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు. ఐఎన్ఏలో పోరాడిన ఓ సైనికుడి జీవితగాథతో 1945 సినిమా తెరకెక్కుతోంది. మొత్తానికి బాహుబలిలో గదతో యుద్ధరంగంలోకి దిగిన రానా ఈ మూవీలో గన్నుతో యుద్ధరంగంలో దిగుతున్నాడన్న మాట.