Begin typing your search above and press return to search.

రానా... వారం రోజుల వెజిటేరియన్‌!

By:  Tupaki Desk   |   12 April 2015 9:30 AM GMT
రానా... వారం రోజుల వెజిటేరియన్‌!
X
కొద్దిమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా సినిమా వాళ్లల్లోనూ నాన్‌వెజ్‌ ప్రియులు కొద్దిమంది ఉన్నారు. అందులో రానా ఒకరు. ఈ ఆరున్నర అడుగుల కండల వీరుడి మెనూలో తప్పకుండా ఏదో ఒక నాన్‌ వెజ్‌ డిష్‌ ఉండి తీరాల్సిందే. పైగా ఎక్సర్‌సైజ్‌ బాడీ కాబట్టి తాను తీసుకొనే ఆహారంలో బలమైన పదార్థాలు ఉండేలా ఆయన జాగ్రత్త పడుతుంటాడు రానా. అయితే లైఫ్‌లో తొలిసారి ఆయన ఓ వారం రోజులపాటు నాన్‌వెజ్‌ అన్నదే లేకుండా ఫుడ్‌ తీసుకొన్నాడట.

ఎందుకో తెలియదు కానీ... తొలిసారి నా జీవితంలో నాన్‌ వెజ్‌ లేకుండా గడిపానోచ్‌ అంటూ ఎగిరి గంతేస్తున్నాడు. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో తన అభిమానులతోనూ పంచుకొన్నాడు. బహుశా 'బెంగుళూరు డేస్‌' రీమేక్‌ కోసమే ఆయన ఇలాంటి ప్రయత్నం చేసుంటాడని సినిమా వర్గాలు అంటున్నాయి. 'బాహుబలి' సినిమాలో భారీగా కనిపించాలని రానా బాగా ఒళ్లు చేశారు. ఏకంగా 130కిలోలకు పైగా పెరిగారు. ఇప్పుడు ఆ సినిమా పూర్తి కావడంతో కొత్త సినిమాలకి తగ్గట్టుగా తనని తాను మార్చుకొంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొన్ని రోజులపాటు నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలని రానా నిర్ణయించుకని ఉండొచ్చని చెబుతున్నారు.