Begin typing your search above and press return to search.

మోడరన్ బాహుబలి-భలే ఉన్నారు

By:  Tupaki Desk   |   4 Jan 2018 8:30 AM GMT
మోడరన్ బాహుబలి-భలే ఉన్నారు
X
బాహుబలి 2 విడుదలై ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంకా దాని మేనియా ఫాన్స్ ని వదలడం లేదు. అందుకు సాక్ష్యమే ఈ పిక్. బాహుబలితో అందులో నటించిన ప్రతి ఒక్కరికి జాతీయ - అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన మాట అక్షరాల నిజం. టాలీవుడ్ లో సీనియర్ అగ్ర హీరోలు సైతం ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాని పాపులారిటీ ఒక్క బాహుబలితో ప్రభాస్ - అనుష్క - రానా - తెచ్చేసుకున్నారు.ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళు ఇప్పుడు నటిస్తున్న స్టిల్స్ ని తీసుకుని బాహుబలి గెటప్స్ తో పోలుస్తూ కొందరు డిజైన్ చేసిన మిక్సింగ్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రాజసం ఉట్టిపడే జుట్టుతో ఠీవిగా మహారాజ దర్పం చూపించిన ప్రభాస్ సాహో కోసం స్టైలిష్ కట్ లోకి మారిపోవడం చాలా కొత్తగా అనిపిస్తోంది.

ఇక బాహుబలిలో దేవసేనగా వయసు పరంగా రెండు రకాల షేడ్స్ లో కనిపించిన అనుష్క భాగమతి కోసం ఒక సరికొత్త యోగిని తరహా లుక్ ఇవ్వడం బాగా హై లైట్ అవుతోంది. ఇక రానా హాథీ మేరీ సాథీ కోసం జుట్టు కురచగా కత్తిరించుకుని చాలా కొత్తగా భల్లాలదేవా గెటప్ కి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు బాహుబలిలో గెటప్స్ ని కొత్త సినిమాల్లో గెటప్స్ మిక్స్ చేస్తూ షేర్ చేస్తున్న ఈ పిక్ చాలా ఫన్నీ గా అనిపించడంతో సోషల్ మీడియా యుజర్స్ బాగా షేర్ చేసుకుంటున్నారు. కాని శివగామి - కట్టప్ప - బిజ్జలదేవాలను కూడా కలిపితే బాగుండేది కదా అనేవారున్నారు కాని అవి కూడా చేసుంటే ఇంకా హై లైట్ అయ్యేది.