Begin typing your search above and press return to search.

రానా బాబూ.. నువ్వు మామూలోడివి కాదు!

By:  Tupaki Desk   |   30 Jun 2015 10:48 AM GMT
రానా బాబూ.. నువ్వు మామూలోడివి కాదు!
X
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్ర కోసం నాకు టాలీవుడ్‌లో రానా దగ్గుబాటి తప్ప వేరే ఆప్షన్‌ కనిపించలేదని మొహమాటం లేకుండా చెప్పేశాడు రాజమౌళి. మరి మనోడిలో అంతలా ఏముంది అంటే.. అతడి ఫిజిక్కే. టాలీవుడ్‌లో సిక్స్‌ ప్యాక్‌ హీరోలైతే ఉన్నారు కానీ.. రానాలాంటి టార్జాన్‌ రూపం మాత్రం ఎవ్వరికీ లేదు. ప్రభాసే భారీకాయుడంటే అతడిని మించిన భారీ ఆకారం రానాది. అందుకే ప్రభాస్‌కు దీటుగా రానాను నిలబెట్టాలనుకున్నాడు జక్కన్న.

ఐతే రాజమౌళి లాంటోడు తన మీద అంత నమ్మకం పెట్టినపుడు.. అతడి అంచనాలకు మించి తయారవ్వాలి కదా. అందుకే బాహుబలి టైంలో విపరీతంగా ఫిజిక్‌ పెంచాడు రానా. అందుకోసం స్పెషల్‌ డైట్‌ తీసుకున్నాడు. భారీగా ఫుడ్డు లాగించాడు. మామూలుగానే భోజన ప్రియుడు. కండలు పెంచడమంటే మహా ఇష్టం. అలాంటిది సినిమా కోసం ఇంకా భారీగా తయారవ్వాలనేసరికి మనోడు రెచ్చిపోయాడు. అందులో భాగంగా రానా ఓసారి లంచ్‌కు రెడీ అవుతుండగా తీసిన ఫొటోను బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్లో షేర్‌ చేశాడు. ఇప్పుడర్థమైందా.. రానా బాహుబలి కోసం ఎంత కష్టపడ్డాడో పాపం!