Begin typing your search above and press return to search.

ఎవడు బ్రో నీకు చెప్పింది, నీ సోది..!

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:19 AM GMT
ఎవడు బ్రో నీకు చెప్పింది, నీ సోది..!
X
రానాకు కోపం వచ్చింది.. ట్విట్టర్ లో రానా ఆ కోపంను వెళ్లగక్కాడు. రానా హీరోగా నటించి విడుదలకు సిద్దంగా ఉన్న విరాట పర్వం సినిమా కు సంబంధించిన ఒక వెబ్‌ పోర్టల్‌ రాసిన కథనంపై ఆ కోసం. విరాట పర్వం చిత్ర దర్శకుడికి మరియు సంగీత దర్శకుడికి మద్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేధాల కారణంగానే ఇప్పుడు సినిమాకు కొత్త సంగీత దర్శకుడు వర్క్‌ చేస్తున్నాడు అంటూ సదరు కథనంలో పేర్కొన్నారు. సినిమా విడుదల ఆలస్యం అవ్వడం కు కూడా ఆ కారణం అయ్యి ఉండవచ్చు అంటూ వారు పేర్కొన్నారు. అందుకు రానా అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో రానా ఆ కథనంకు స్పందించాడు. ఎవడు బ్రో నీకు చెప్పింది. నీ సోది అంటూ కౌంటర్ ఇచ్చాడు. రానా రిప్లై కు సదరు వెబ్‌ పోర్టల్‌ తమ కథనంను వెంటనే డిలీట్ చేయడంతో పాటు ట్విట్టర్ లో కూడా తమ ట్వీట్ ను వెనక్కు తీసుకున్నారు.

అప్పటికే ఆ పోస్ట్‌ చాలా మందికి రీచ్ అవ్వడంతో అసలు విషయం తేలిపోయింది. రానా సినిమా టెక్నికల్‌ విభేదాల పై రానా రియాక్షన్ తో ఎలాంటి విభేదాలు కాని ఇబ్బందులు కాని లేవని క్లారిటీ వచ్చేసింది. రానా మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమద్య వార్తలు వచ్చాయి. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్న కారణంగా ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. విడుదల విషయంలో మరింత స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమా సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అయ్యి ఉండేది. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి కంటెంట్ తో రూపొందినట్లుగా టీజర్ మరియు గ్లిమ్స్ పాటలు చూస్తుంటే అర్థం అవుతోంది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ చాలా నాచురల్‌ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సాయి పల్లవి నుండి మరో మంచి ఔట్‌ పుట్‌ అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా విరాట పర్వం సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న విరాట పర్వం సినిమా కు సంబంధించి ఫేక్ వార్తలు రావడంతో రానా సహించలేక కాస్త సీరియస్ గానే ఇలా రియాక్ట్‌ అయ్యాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే చేత్తో సినిమా ఎప్పుడో కూడా కాస్త ట్వీట్‌ చేయండి రానా గారు అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రానా నుండి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.