Begin typing your search above and press return to search.
'మహానాయకుడు' బాబు బయోపిక్..?
By: Tupaki Desk | 16 Feb 2019 8:20 AM GMTఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేక పోయింది. ఎన్టీఆర్ సినీ చరిత్రను కథానాయకుడు చిత్రంలో చూపించిన దర్శకుడు క్రిష్ రాజకీయ చరిత్రను మహానాయకుడు చిత్రంలో చూపించేందుకు సిద్దం అయ్యాడు. కథానాయకుడు మొత్తం కూడా ఎన్టీఆర్ పాత్ర కీలకంగా కనిపించింది. కాని సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం 'మహానాయకుడు' మొత్తం చంద్రబాబు నాయుడు సెంటర్ గా సాగుతుందట.
'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించిన విషయం తెల్సిందే. ఈనెల 22న విడుదల కాబోతున్న 'మహానాయకుడు' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన క్రిష్ పోస్టర్ లను విడుదల చేశాడు. పోస్టర్స్ లో బాలకృష్ణ తో పాటు రానాకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. పోస్టర్ లోనే కాకుండా సినిమాలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర అదే రానా పోషించిన పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందట. మొదటి పార్ట్ లో కనిపించి కనిపించనట్లుగా కనిపించిన రానా రెండవ పార్ట్ లో పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ ను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎక్కించింది చంద్రబాబు నాయుడు అన్నట్లుగా మహానాయకుడు చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం చంద్రబాబు నాయుడు కను సన్నల్లో తెరకెక్కిన విషయం అందరికి తెలిసిన రహస్యం. బాలయ్య కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 'మహానాయకుడు' చిత్రంలో తన పాత్ర కంటే రానా పాత్ర ఎక్కువ ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే క్రిష్ మహానాయకుడు చిత్రంలో బాబు పాత్రకు కాస్త గట్టి ప్రాధాన్యతే ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహానాయకుడు మూవీ ఎన్టీఆర్ బయోపిక్ కాకుండా చంద్రబాబు బయోపిక్ లా ఉంటుందేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.