Begin typing your search above and press return to search.
రానా అంత పెద్ద త్యాగాలు చేశాడా?
By: Tupaki Desk | 5 Jan 2016 1:00 PM IST‘బాహుబలి’ సినిమాతో రానా దగ్గుబాటి రేంజే మారిపోయింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్టిస్టుల్లో అతనొకడు. ‘బాహుబలి’ ఒప్పుకునే టైంలో ఇదంతా ఊహించాడో లేదో కానీ.. ఆ సినిమా అతడికి చేసిన మేలు మాత్రం అంతా ఇంతా కాదు. ఐతే ‘బాహుబలి’ కోసమని తాను పెద్ద త్యాగాలే చేసినట్లు చెబుతున్నాడు రానా. ఈ సినిమా చేయకపోయి ఉంటే.. హీరోగా రెండు పెద్ద హిట్లు రానా ఖాతాలో పడేవట. అందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ ‘పటాస్’ కాగా.. ఇంకోటి తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’. ఈ రెండు సినిమాలూ రానానే చేయాల్సిందట.
అనిల్ రావిపూడి దర్శకుడిగా అవకాశం కోరుతూ ముందు రానానే కలిసి ‘పటాస్’ కథ వినిపించాడట. ఐతే ‘బాహుబలి’కి డేట్లు ఇచ్చేయడంతో కుదరదని చెప్పేశాడట రానా. మరోవైపు తన తమ్ముడు జయం రవితోనే ఎక్కువగా సినిమాలు చేసే తమిళ డైరెక్టర్ రాజా కూడా ‘తనీ ఒరువన్’ స్క్రిప్టును ముందు రానాకే వినిపించాడట. అతడితోనే సినిమా చేయాలనుకున్నాడట. ‘బాహుబలి’ కోసమని దాన్ని కూడా వదులుకున్నాడట రానా. పటాస్ - తనీ ఒరువన్ సినిమాల్లో రానా నటించి ఉంటే ఫలితాలెలా ఉండేవన్నది పక్కనబెట్టేస్తే.. రానా తీసుకున్న నిర్ణయాల వల్ల అతడు నష్టపోయిందేమీ లేదు. ఇటు బాహుబలి వల్ల అతను లాభం పొందాడు. అటు ‘పటాస్’ ద్వారా కళ్యాణ్ రామ్ - ‘తనీ ఒరువన్’తో జయం రవి చాన్నాళ్ల తర్వాత మంచి హిట్లు కొట్టారు.