Begin typing your search above and press return to search.
భానుమతి అయితే ఏంటి భాగమతి అయితే ఏంటి..?
By: Tupaki Desk | 1 Nov 2018 6:10 AM GMTరానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు.. క్యారెక్టర్లు ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. అదే ట్రెండ్ కొనసాగిస్తూ తాజాగా 'విరాటపర్వం 1992' అనే సినిమాకు పచ్చజెండా ఊపాడట. ఈ సినిమాకు దర్శకుడు వేణు ఉడుగుల. 'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు తన మొదటి సినిమాతో చాలామంది దృష్టిని ఆకర్షించాడు. సినిమా సూపర్ హిట్ కాలేదు గానీ తను ఎంచుకున్న పాయింట్.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం చాలామందికి నచ్చింది.
వేణు 1992 లో సాగే ఒక పీరియడ్ ఫిలిం స్టొరీతో తన సెకండ్ సినిమా ను తెరకెక్కించేందుకు చాలా రోజుల నుండి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి. ఈ సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. నితిన్ సై అన్నాడని మొదట్లో వార్తలు వినిపించాయి. తర్వాత శర్వానంద్ కోర్టులోకి ఈ స్టొరీ చేరిందట. మొదట్లో ఇంట్రెస్ట్ చూపించినా ఎందుకో లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యాడట. దీంతో ఈ 'విరాటపర్వం 1992' ఫైనల్ గా భల్లాలదేవుని బుట్టలో పడింది.
సాయి పల్లవితో నటించేందుకు చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని అందుకే ఈ వేణు ఉడుగులకు ఇన్ని రోజులు హీరో ఫైనలైజ్ కాలేదని ఇప్పుడు రానా మాత్రం అలాంటివేవీ పట్టించుకోకుండా 'యస్' చెప్పాడని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సాయి పల్లవి యాటిట్యూడ్ ఒక కారణం అయితే.. యాక్టింగ్ తో హీరోలను డామినేట్ చేయడం మరో కారణం అట! అయినా మన పిచ్చి గానీ భల్లాల దేవుడికి భానుమతి అయితే ఏంటి భాగమతి అయితే ఏంటి..?