Begin typing your search above and press return to search.

పెళ్ల‌య్యాకా ఏ మార్పూ రాలేద‌న్న రానా

By:  Tupaki Desk   |   2 Nov 2020 5:50 PM GMT
పెళ్ల‌య్యాకా ఏ మార్పూ రాలేద‌న్న రానా
X
హీరో రానా దగ్గుబాటి ఆగస్టులో తన ప్రియురాలు మిహీకా బజాజ్ ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొన్న ద‌స‌రా వేడుక‌ను అత్తారింట్లోనే సంబ‌రంగా జ‌రుపుకున్నారు రానా. తాజా ఓ ఇంటర్వ్యూలో రానా చెప్పిన ఓ సంగ‌తి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

వివాహం తరువాత తన జీవితం గురించి రానా ఓపెన‌ప్ అయ్యాడు. ఆశ్చర్యకరంగ, ఈ 3 నెలల్లో రానా వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ చాలా సాధారణంగానే ఉందిట‌. అస‌లు త‌న‌లో ఎలాంటి మార్పు రాలేద‌ని కూడా చెప్పాడు.

వివాహం యువ‌తీ యువ‌కుల‌ జీవితాల్లో చాలా మార్పులను తెస్తుందని అంతా అంటుంటారు. కానీ నేను అంగీకరించను. నా జీవితంలో ఇప్పటివరకు పెద్ద మార్పులు ఏవీ లేవు. అయితే వివాహం తర్వాత నా బాధ్యత పెరిగింది. నేను ఇప్పుడు చాలా స్థిరంగా ఉన్నాను. మిహీకా ఒక ఉల్లాసమైన వ్యక్తి . ఆమెతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. నా జీవితాంతం ఆమెతో గడపాలని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రానా చెప్పారు. మొత్తానికి మిహీక‌తో రానా మ‌మేక‌మై ప్రేమైక జీవ‌నాన్ని ఆస్వాధిస్తుండ‌డం అభిమానుల‌కు ఆనంద‌దాయ‌క‌మే.

అన్న‌ట్టు వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్ని పెండింగులో పెట్టిన రానా వాటికి సంబంధించిన అప్ డేట్ చెప్ప‌లేదేమిటో? హిర‌ణ్య కశ్యప మొద‌లెట్టేది ఎపుడు? అర‌ణ్య ను రిలీజ్ చేసేదెపుడు? విరాఠ‌ప‌ర్వం ఎంత‌వ‌ర‌కూ వచ్చింది? ఇలాంటి వాటికి స‌మాధానం చెప్పాల్సి ఉంది ఇంకా.