Begin typing your search above and press return to search.

అంతకుముందే పుట్టిన ప్రేమ మాది: స్టార్ హీరో లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   23 May 2020 1:30 PM GMT
అంతకుముందే పుట్టిన ప్రేమ మాది: స్టార్ హీరో లవ్ స్టోరీ
X
సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వినిపిస్తున్న పేరు మిహిక బజాజ్. అసలు మిహీక ఎవరు? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ అందరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి కారణం.. బ్యాచిలర్ హీరో రానా మిహీకతో ప్రేమలో పడ్డాడు. అంతేగాక ఈ ఏడాది ఇద్దరు ఒకటి కాబోతున్నారట. అంతా సైలెంట్ గా ఉన్నప్పుడు సడెన్ గా 'తను ఎస్ చెప్పింది' అని ఏకంగా ప్రియురాలు మిహికా బజాజ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరిచయం చేసాడు. ఇక మొత్తానికి రానా ప్రేమ సక్సెస్ అయిందని తెలిసి ఫ్యాన్స్ అంతా హ్యాపీ అయ్యారు. అసలు మిహికతో రానాకు ఎలా పరిచయం ఎలా?పరిచయం ప్రేమ వరకు ఎలా అనే కోణంలో సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయాలు తాజాగా మంచు లక్ష్మితో రానా ఇంస్టాగ్రామ్ లో బయట పెట్టాడు. వీరి సంభాషణలో హీరో వెంకటేష్ కూతురు.. తన చెల్లి అశ్రిత పేరు బయటకొచ్చింది. మిహికా బజాజ్, వెంకీ కూతురు అశ్రిత బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని.. ఆ కారణంగానే మిహికాతో రానా పరిచయం జరిగిందని చెప్పాడు. అంతేగాక రానా - మిహికాల లవ్ మేటర్ అశ్రితకు ముందే తెలుసట. రానాకు చెల్లి అశ్రిత బాగా సపోర్ట్ చేసిందని తెలుస్తుంది.

అయితే ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు పుట్టిందని తెలిపాడు. తన ప్రేమను మిహీకా అంగీకరించడంతో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి వరకు తీసుకెళ్లామని వెల్లడించారు. మిహీకా తన ఫ్యామిలీకి పరిచయం ఉన్న అమ్మాయేనని రానా అన్నాడు. అంతేకాకుండా, మిహీకాకు ముంబైలో ఉన్న ఫ్రెండ్స్ కూడా తనకు స్నేహితులు కావడం కూడా తామిద్దరి మధ్య బంధం ఏర్పడటానికి కారణమైందని తెలిపాడు. మిహీకా నార్త్ ఇండియన్ అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగింది. మిహీకాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చని.. తన కుటుంబ సభ్యులతో ఆమె తెలుగులో బాగానే మాట్లాడుతుందని రానా చెప్పాడు. తన ప్రేమ విషయం తల్లి లక్ష్మికి చెప్పగానే ఆమె ముఖంలో షాక్‌తో కూడిన హ్యాపీనెస్‌ కనిపించందని అన్నాడు. తాజాగా జరిగింది రోకా వేడుక అని.. త్వరలోనే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుంటామని రానా తెలిపాడు. 2017లో సొంతంగా ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ కంపెనీని స్థాపించి యంగ్ బిజినెస్ ఉమెన్‌గా సత్తా చాటుతోంది మిహీక. ఒకవైపు తల్లి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చూస్తూనే.. తాను సొంతంగా రన్ చేస్తున్న ఇంటీరియల్ డిజైన్ కంపెనీ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది మిహికా. మొత్తానికి ఈ ఏడాది రానా-మిహీక ఒకటి కానున్నారు.