Begin typing your search above and press return to search.

మేము గొప్ప జంటగా నిలుస్తాం

By:  Tupaki Desk   |   25 July 2020 4:00 PM GMT
మేము గొప్ప జంటగా నిలుస్తాం
X
బాహుబలి స్టార్‌ రానా వివాహానికి సిద్దం అయ్యాడు. మిహికా బజాజ్‌ తో రానా వివాహం ఆగస్టు 8న అంగరంగ వైభవంగా జరుగబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో రానా తనకు కాబోయే భార్య మిహికా గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్‌ చేసుకున్నారు. తమ ప్రేమ కథను స్వీట్‌ అండ్‌ షార్ట్‌ గా వివరించి అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. మేము మిహికా ఫ్యామిలీ ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటి నుండి వాళ్ల ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం. మా ఇద్దరి మద్య కొనసాగిన స్నేహం ఇప్పుడు పెళ్లికి దారి తీసింది.

నా పెళ్లి కోసం నేను ఒక వింతైన సమయంను ఎంపిక చేసుకున్నాను. పెళ్లి చేసుకునేంత పెద్ద వాడిని అయ్యాను. కనుక పెళ్లికి ఇదే కరెక్ట్‌ టైం గా భావించాను. జీవితంలో అన్ని వాటంతట అవే సజావుగా సాగి పోతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి అనేది కూడా అంతే సజావుగా సాగుతుందని నేను భావిస్తున్నాను. ఆమె చాలా మంచి మనసున్న అమ్మాయి. మా జంట ఇతరులకు ఆదర్శంగా గొప్ప జంటగా నిలుస్తుందని నమ్ముతున్నట్లుగా రానా అన్నాడు.

రానా.. మిహికల మద్య పరిచయంకు కారణం వెంకటేష్‌ కూతురు అశ్రిత. మిహిక మరియు అశ్రితలు స్నేహితులు అవ్వడం రానాతో పరిచయం కారణంగానే పెళ్లి వరకు వచ్చింది. మే 12వ తేదీన రానా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆ తర్వాత పరిణామాలు అన్ని కూడా చకచక జరిగి పోతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రానా వివాహంకు దగ్గుబాటి వారి ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేసింది.