Begin typing your search above and press return to search.

బాబాయ్ కోసం చైతూ కోసం రానా సాహ‌సం

By:  Tupaki Desk   |   11 Dec 2019 7:18 AM GMT
బాబాయ్ కోసం చైతూ కోసం రానా సాహ‌సం
X
సినిమా ఏదైనా రిలీజ్ ముందు కాంప్లికేష‌న్స్ ఎదురైతే ఆ టెన్ష‌న్ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. నిర్మాత‌ల‌కు అన్ని వైపుల నుంచి బొప్పి క‌ట్టేస్తుంది. ఓ మోస్త‌రు బ‌డ్జెట్ సినిమా అయితే పంపిణీ వ‌ర్గాలు.. ఎగ్జిబిట‌ర్లు స‌హా అంద‌రి నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలు అయితే ఆ ఒత్తిడి మ‌రీ ఎక్కువ‌. ఫ్యాన్స్ నుంచి స‌తాయింపులు ఎదుర్కోవాలి. అయితే వెంకీమామ‌కు చివ‌రి నిమిషం క‌ష్టాలు లేవా? అంటే.. లేక‌పోలేదు. ఈనెల 13న రిలీజ్ చేస్తున్నామ‌ని తేదీ ప్ర‌క‌టించేందుకు టీమ్ అంత‌గా ఎందుకు స‌తాయించిందంటే దానికి ప్ర‌త్యేక‌మైన రీజ‌న్ ఉందిట‌.

వెంకీమామ‌లో క‌శ్మీర్ ఎపిసోడ్స్ స‌హా విజువ‌ల్ రిచ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉన్నాయిట‌. వాటికి వీఎఫ్ ఎక్స్ లో మెరుగులు దిద్దాల్సి ఉండ‌గా చివ‌రి నిమిషంలో కొన్ని కాంప్లికేష‌న్స్ ని టీమ్ ఎదుర్కొంది. ఇక్క‌డ చేసిన ప‌ని ఏదీ స‌రిగా కుద‌ర‌ లేదు. దీంతో అప్ప‌టికే అమెరికాలో ఉన్న రానా బ‌రిలో దిగి అక్క‌డ స్థానిక స్టూడియోల‌ తో మాట్లాడి వీఎఫ్.ఎక్స్ ప‌రంగా స‌మ‌స్య‌లేవీ రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. దానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చాకే అమెరికా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ముందు రిలీజ్ పై క్లారిటీనిచ్చేశారు. ఆ త‌ర్వాత తాపీగా సురేష్ బాబు వెంకీమామ రిలీజ్ తేదీని మార్చారు. ముందే చెప్పిన‌ట్టే వెంక‌టేష్ బ‌ర్త్ డే కానుక‌గా డిసెంబ‌ర్ 13న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప‌ది రోజుల ముందు వ‌ర‌కూ డైల‌మా కొన‌సాగి చివ‌రికి క్లారిటీ తెచ్చుకోగ‌లిగింది రానా సాహ‌సం వ‌ల్ల‌నే

ఇక రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన త‌ర్వాత రానా ప్ర‌మోష‌న్ గురించి తెలిసిందే. వెంకీమామ చిత్రాన్ని బాబాయ్ వెంక‌టేష్ కి.. త‌నకు అత్యంత ప్రీతి పాత్రుడైన చైత‌న్య‌ కు ఓ మెమ‌రీ గా నిల‌వాల‌ని రానా నేరుగా బ‌రిలో దిగి ప్ర‌చారం చేస్తున్నారు. ద‌గ్గుబాటి ఫ్యామిలీతో చైత‌న్య‌ను క‌లిపి ఇంట‌ర్వ్యూ లు చేశాడు. ఇవ‌న్నీ మీడియాలో వైర‌ల్ గా ప్ర‌చారం తెచ్చాయి. అయితే లెవంథ్ అవ‌ర్ టెన్ష‌న్ అన్న‌ది వెంకీమామ‌కు కూడా ఎదురైంది. రానా చాక‌ చ‌క్యం వ‌ల్ల అది ప‌రిష్కృతం అయ్యింద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌మోష‌న్స్ లోనూ రానా క్రియేటివిటీ చూపించారు. ద‌ర్శ‌కుడు బాబీని రిలీజ్ తేదీ ఎప్పుడు? అని రానా స‌తాయిస్తున్న వీడియోని స‌రైన టైమింగు తో ఉప‌యోగించుకున్న సంగ‌తి తెలిసిందే.