Begin typing your search above and press return to search.

జీవితంలో ఎంత‌ పెద్ద స‌మస్య‌ను అయినా ఈజీగా తీసుకోవాల‌ని నేర్పింది!- రానా

By:  Tupaki Desk   |   21 March 2021 11:50 AM GMT
జీవితంలో ఎంత‌ పెద్ద స‌మస్య‌ను అయినా ఈజీగా తీసుకోవాల‌ని నేర్పింది!- రానా
X
``జీవితంలో ఎంత‌ పెద్ద స‌మస్య‌ను అయినా ఈజీగా తీసుకోవాల‌ని నేర్పింది ఈ సినిమా. మా అంద‌రిలో మార్పు తెచ్చింది`` అని అన్నారు ద‌గ్గుబాటి రానా. అత‌డు న‌టించిన అర‌ణ్య ఈనెల 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ వేడుక‌లో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇదే వేదిక‌పై లీడ‌ర్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌.. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - ``కెమెరా ముందు ఒక వ్య‌క్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖ‌ర్ క‌మ్ములగారు.. ఆయ‌న కార్య‌క్ర‌మానికి రావ‌డం సంతోషంగా ఉంది. నేను చాలా న‌ట‌న‌ నేర్చుకున్నాను అని చెప్ప‌డానికి ఆయ‌న్ని ఇక్క‌డికి పిలిచాను (న‌వ్వుతూ). ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడివి మ‌ధ్య‌లో..ఏనుగుల ద‌గ్గ‌ర ఉన్నాను. ఆ అనుభ‌వం మాటల్లో చెప్ప‌లేనిది. ఒక రియ‌ల్ రెయిన్ ఫారెస్ట్ మ‌ధ్య‌లో ఉండే ఎక్స్‌పీరియ‌న్స్ మీకు ఈ నెల 26న అర‌ణ్య‌తో తెలుస్తుంది. ఆ అడ‌విలో మ‌నుషులు చేసే అరాచ‌కాన్ని చూపించాం. ఈ రోజు ఎక్క‌‌డ అడివి ఉన్నా స‌రే ఇలాంటి ఓ స‌మస్య ఉంది. నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్స‌రాలు అడవిలో ఉన్నా.. నాకు ఆ ఏనుగుల‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్ల నా జీవితంలో ప్ర‌తి మనిషితో నాకున్న రిలేష‌న్ మారిపోయింది. మాములుగా నువ్వు ఎవ‌రు? అని తెలుసుకోవాలి అంటారు కాని ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. మీరు ఈ భూమ్మీదే ఉంటారు ఈ భూమికోసం ప‌నిచేస్తే ఆ భూమి తిరిగి మీకు మీ త‌ర‌త‌రాల‌కు ఇస్తుంది అని ఏనుగులు నేర్పించాయి. ప్ర‌భు సాల్మోన్ ఒక ఫోటో చూసి న‌న్ను సెల‌క్ట్ చేశారు. నాకు ఎంతో నేర్పించిన వ్య‌క్తి అయ‌న‌. ఈ సినిమా థాయిలాండ్- కేర‌ళ‌- స‌తార్‌- మ‌హా భ‌లేశ్వ‌రం.. ఇలా ఆరు అడ‌వుల‌లో తీశాం. ఈ సినిమా మా అంద‌రిలో మార్పు తెచ్చింది. జీవితంలో పెద్ద ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చినా ఎలా ఈజీగా తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్ర‌పంచంలోకి వెళ్ల‌బోతున్నారు‌`` అని అన్నారు.

వేదిక‌పై ఉన్న బాబాయ్ వెంక‌టేష్ గురించి ప్ర‌స్థావిస్తూ రానా చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ``సాయి మాధ‌వ్‌గారు.. క్రిష్ ‌గారు క‌లిసి కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధ‌వ్ రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది అది ఏంటంటే `చ‌ప్ప‌ట్లంటే వ్య‌స‌నం..ఆ చప్ప‌ట్ల మ‌ధ్య‌న ఒక్క‌డుంటాడు..దీన‌మ్మ ఇది నిజ‌మే క‌దా అని చూస్తుంటాడు.. ఆ ఒక్క‌డి కోసం నువ్వు నాట‌కం ఆడు`` అని ఇప్పుడు ఆ ఒక్క‌డి కోస‌మే ఈ సినిమా కూడా చేశాను. నాకు చిన్నాన‌లో ఏదో ఒక పార్ట్ అవ్వాల‌ని కోరిక ఉండేది. 11సంవ‌త్స‌రాల త‌ర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను..బాగా న‌టించ‌గ‌లుగుతున్నాను అని ఆయ‌న్ని ముఖ్య అతిథిగా పిలిచాం.. ఈ సినిమాలో మా నాన్న పాత్ర‌కి చిన్నాన వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు అని తెలిపారు.