Begin typing your search above and press return to search.

మాహిష్మతిని మిస్సవుతా.. బాధగా ఉంది

By:  Tupaki Desk   |   26 March 2017 5:57 PM GMT
మాహిష్మతిని మిస్సవుతా.. బాధగా ఉంది
X
''కాలం కరిగిపోయే క్షణాల సమూహం అయితే.. బాహుబలి సినిమా ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం అని ఆనాడే చెప్పాను. బాహుబలి విషయంలో ఈ మాటను నిజం చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే.. నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే నాకు బాధ కూడా ఉంది'' అంటూ సెలవిచ్చాడు దగ్గుబాటి రానా. భల్లాలదేవగా ఇప్పటికే సంచలనాలు సృష్టించిన రానా.. బాహుబలిః ది కంక్లూజన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఇంకాస్త సంచలనంగా మట్లాడాడు.

''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాసే నా బెస్ట్ కో-స్టార్. అయితే ఇప్పుడు నా బాధ గురించి చెబుతాను. ఆల్రెడీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా వచ్చేశాయి. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఉత్కంఠకు గురయ్యాడు రానా. ఇకపోతే ఈ సినిమాలో పనిచేసినప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి వల్లీ (కీరవాణి భార్య.. బాహుబలికి లైన్ ప్రొడ్యూసర్) తనని తిటే్టవారని.. ఆమె ఇలా తిడుతుంటే తనకు రియల్ లైఫ్‌ శివగామిని చూసినట్లే ఉండేదని చెప్పుకొచ్చాడు.

''నన్ను ఫోన్ చేసి 3-4 వారాలకు ఒకసారి తిట్టండి వల్లిగారూ ప్లీజ్. మీ తిట్లే నాకు ఇష్టం. మీతో తిట్టించుకోవడానికి నేను ఎన్ని అవకాశాలు అయినా ఇస్తాను. సాహోరే బాహుబలి'' అంటూ తన స్పీచ్ ముగించాడు.