Begin typing your search above and press return to search.

నిజంగానే పవన్ చాలా స్పెషల్: రానా

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:31 PM GMT
నిజంగానే పవన్ చాలా స్పెషల్: రానా
X
'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ తో సమానమైన పాత్రను రానా పోషించాడు. ఈ సినిమాలో ఆయన పవన్ ను ఎదిరించే డేనియల్ శేఖర్ పాత్రలో కనిపిస్తాడు. చాలా గ్యాప్ తరువాత రానా పోషించిన పాత్ర ఇది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా తనదైన స్టైల్లో మాట్లాడాడు. "మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంటా .. నేనెవరో తెలుసా?" అంటూ ఈ సినిమా డైలాగ్ తో స్పీచ్ మొదలుపెట్టాడు.

" ఇందాక సాగర్ చెప్పినట్టుగా నేను కూడా 'పంజా' ఆడియో ఫంక్షన్ కి వెళ్లాను. రెండు గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నాను .. ఆ తరువాత అక్కడికి చేరుకున్నాను. భీమ్లా విషయానికి వస్తే .. ఈ సినిమాతో నేను చాలామంది మేధావులను కలిశాను. నేను యాక్టర్ నై 12 ఏళ్లు అయింది. తెలుగు సినిమాలు చేశాను .. హిందీ సినిమాలు చేశాను. కానీ హీరోను ఎలా కావాలనే కాన్సెప్ట్ నాకు ఇంకా అర్థం కాలేదు. కొత్తలో దర్శకులు ఎలాగో ఫోర్స్ చేసి యాక్టింగ్ నేర్పించారు. వాళ్ల సినిమాలను నేను ఎక్కడ చెడగొడతానోనని!

యాక్టర్ ను అయ్యాను .. హీరో కావడం ఎలా అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడానికి తిరుగుతున్నప్పుడు, నా కళ్ల ముందుకు వచ్చిన హీరో .. పవన్ కల్యాణ్. ఇండియాలోని చాలా మంది సూపర్ స్టార్స్ తో నేను చేశాను. కానీ పవన్ కల్యాణ్ గారు డిఫరెంట్ .. ఆయన చాలా స్పెషల్. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే, కల్యాణ్ గారి ప్రభావంతో ఇక ముందు నేను చేసే సినిమాలు వేరేలా ఉంటాయి. నన్ను ఇంతగా ప్రభావితం చేసిన పవన్ గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

ఇంకో మేధావి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు .. ఆ మనిషేంటో ఆయన మాట్లాడేదంతా చూస్తే పొరపాటున సినిమాల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. బయట ఉండుంటే మార్స్ కి రాకెట్లు పంపించేవారేమో. ఈ సినిమాకి ఆయన అందించిన సహకారం మరిచిపోలేనిది. నిర్మాతలు వంశీ .. చినబాబు గారు పవన్ కల్యాణ్ గారి కంటే ముందు నన్ను తీసుకున్నారు. ఆ తరువాతనే పవన్ గారు జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో సముద్రఖని .. నిత్యామీనన్ .. సంయుక్త మీనన్ వంటి గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లంతా కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. ఇక తెలుగు సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ సెలవు తీసుకున్నాడు.