Begin typing your search above and press return to search.
నేను ప్రేమికుడిని కాదు.. అదోరకంః రానా
By: Tupaki Desk | 31 March 2021 9:30 AM GMTరానా ఇండస్ట్రీలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. మొదటి సినిమాతోనే పొలిటికల్ ‘లీడర్’ అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాల్లో నటించాడు. ఇతర భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించాడు. చేసిన పాత్ర మళ్లీ చేయకుండా.. కెరీర్ ను అద్భుతంగా తీర్చి దిద్దుకుంటున్నాడు రానా.
అయితే.. ఇప్పటి వరకూ రానా కెరీర్ ను పరిశీలిస్తే.. ఒక్క లవ్ స్టోరీ కూడా అందులో కనిపించదు. ఆయన సినిమాల్లో ప్రేమ ఉంటుంది గానీ.. ప్రేమ కథల్లో ఆయన లేడు. ఇకపై వచ్చే అవకాశం కూడా దాదాపుగా లేనట్టే. మరి, ఎందుకిలా? ఒక్క లవ్ స్టోరీ సినిమా కూడా రానా ఎందుకు చేయలేదు అనే డౌట్ చాలా మందికి రావొచ్చు. ఇదే విషయాన్ని రానాను అడిగితే ఆయన సమాధానం విని ఆశ్చర్యపోతారు.
తాను అందరిలా రొటీన్ లవ్ స్టోరీలు చేయనని చెబుతున్నారు. దీనికి ఓ కారణం కూడా చూపుతున్నారు రానా. తాను చిన్నప్పుడు కాలేజీకి వెళ్లలేదని, అందువల్ల కాలేజీ ప్రేమ కథలు ఎలా ఉంటాయో తనకు తెలియదని చెప్పడం విశేషం. ఈ కారణంగానే తాను లవ్ స్టోరీస్ ను టచ్ చేయలేదని చెప్పారు రానా.
మొత్తానికి.. తాను అందరిలాంటి వాన్ని కాదు.. అదోరకం అని చెప్పేశారు. రానా చెప్పినట్టుగానే ఆయన నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. మొత్తానికి లవ్ స్టోరీల్లో నటించకపోవడానికి రానా చెప్పిన రీజన్ భలేగా ఉంది కదా!