Begin typing your search above and press return to search.
పెళ్లి అంటే ప్రభాస్ పేరెత్తాడు
By: Tupaki Desk | 20 July 2017 6:47 AM GMTఈ తరం హీరోలు పర్ననల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ కెరీర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతమంది మాత్రం పెళ్లి చేసుకుని తమ జీవితాలను కంటిన్యూ చేస్తుంటే మరికొంత మంది మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఉండేదుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి కుర్రాళ్లలో రానా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఓ సోషల్ మీడియా చిట్ చాట్ లో రానాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి భల్లాల దేవుడి నుంచి అదిరిపోయే ఆన్సర్ వచ్చింది. తన పెళ్లికి ప్రభాస్ తోను.. నితిన్ తోను లింక్ పెట్టాడు రానా. 'ముందుగా ప్రభాస్.. నితిన్ లు పెళ్లి చేసుకున్నాకే నేను చేసుకుంటా. నాకంటే వారి వయసు ఎక్కువ కదా. అందుకే ముందు వాళ్లను చేసుకోనివ్వండి. ప్రస్తుతం నా వయసు 33 ఏళ్లే కదా. అప్పుడే కంగారు ఏముంది? అయినా మా ఇంట్లో వాళ్లే నా పెళ్లి గురించి ఇంతగా ఒత్తిడి చేయడం లేదు. మీరెందుకు ఇంత హడావిడి పడతారు' అనేశాడు రానా.
రానా చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉంది. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరకు ఈ బాహుబలి మ్యారేజ్ కన్ఫాం అనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే.. నితిన్ కంటే రానా వయసు కేవలం ఏడాది మాత్రమే తక్కువ. పైకి చెప్పకపోయినా.. ఈ కుర్రాడికి సంబంధాలు ఖాయం చేస్తున్నారనే టాక్ ఉంది. అయినా పెళ్లి గురించి అడిగితే.. మాట దాటేయడానికి ఇలా ఇతర హీరోలను ఇరికించడం ఏమన్నా బాగుందా రానా?