Begin typing your search above and press return to search.
బాహుబలి లాంటి సినిమాలన్నీ రానాకే
By: Tupaki Desk | 7 Sep 2017 12:46 PM GMTఒక సినిమాలో ఒక తరహా పాత్రలు చేస్తే.. ఖచ్చితంగా అలాంటి పాత్రలే చాలా వస్తాయి. అయితే ఇప్పుడు ''బాహుబలి'' సినిమాలో బల్లాలదేవుడి పాత్రను చేసిన రానా దగ్గుబాటిని.. ఒక ప్రక్కన ఘాజి.. నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో మంచి పాత్రలే వరించినప్పటికీ.. మరో ప్రక్కన మాత్రం.. అసలు బాహుబలి తరహా సినిమా తీస్తుంటే మాత్రం మనోడికి కాల్ రాకుండా ఉండట్లేదు.
మలయాళంలో తీయనున్న మహాభారతం సినిమాలో రానాను ఒక కీలక పాత్రకు అడుగుతుంటే.. మరో ప్రక్కన గుణ శేఖర్ తీయనున్న హిరణ్యకసిపుడి కథలో ఆ రాక్షసుడి పాత్రను పోషించమని అడుగుతున్నారు. అదంతా ఒకెత్తయితే.. బాహుబలి సక్సెస్ ను చూసిన మోహన్ బాబు కూడా రావణా బ్రహ్మ కథను ఇప్పుడు రూపొందించాలని తహతహలాడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ తీసిన ఇదే తరహా కథకు కొత్త హంగులు అద్ది ఇప్పుడు రావణ సినిమాను తీస్తారట. అయితే అందులో ఆంజనేయుడి పాత్రను చేయడానికి రానాకు కబురంపారని టాక్.
నిజానికి ఇప్పుడు బాహుబలి రేంజులో సినిమా అంటే రానా కోసం ఒక్క క్యారక్టర్ అయినా రాసుకుంటున్నారు దర్శకులు. అయితే ఒక ప్రక్కన మెయిన్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్న రానా.. ఇలా ఇతర బాహుబలులలో సైడ్ క్యారక్టర్లు చేస్తాడా అనేదే ఇప్పుడు చూడాల్సిన విషయం.