Begin typing your search above and press return to search.
చెల్లెలి సాయంతో ప్రేమను గెలిచిన హీరో!
By: Tupaki Desk | 18 May 2020 4:30 PM GMTమిహీక బజాజ్.. ఈ పేరు సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా తెగ వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈ మిహీక? ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. దానికి కారణం.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా ఆమెతో ప్రేమలో పడటమే. ఇదే ఏడాది ఇద్దరు ఒకటి కాబోతున్నారు కూడా. అంతా కరోనా మాయలో ఉంటే సడెన్ గా 'ఆమె ఎస్ చెప్పింది' అని ఏకంగా ప్రియురాలు మిహికా బజాజ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక మొత్తానికి రానా ప్రేమ సక్సెస్ అయిందని తెలిసి ఫ్యాన్స్ అంతా హ్యాపీ అయినా.. అసలు మిహికతో రానాకు ఎలా పరిచయం ఏర్పడింది? వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది? అనే కోణంలో సందేహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్ కూతురు అశ్రిత పేరు బయటకొచ్చింది. మిహికా బజాజ్, వెంకీ కూతురు అశ్రిత బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని.. ఆ కారణంగానే మిహికాతో రానా పరిచయం జరిగిందని సమాచారం. అంతేగాక రానా - మిహికాల లవ్ మేటర్ అశ్రితకు ముందే తెలుసి.. అన్నయ్య రానాకు బాగా సపోర్ట్ చేసిందని తెలుస్తుంది.
హైదరాబాద్ అమ్మాయి అయిన మిహీక ఇండియన్ ఆర్కిటెక్చర్ పై ఉన్న మక్కువతో అటు వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ముంబై నుంచి బిజినెస్ కార్యకలాపాలు నడిపిస్తుందట. ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ పై ఇష్టంతో ముంబైలోని రచన సన్సాద్ అనే విద్యా సంస్థ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా పూర్తి చేసింది. తర్వాత లండన్ లోని చెల్సియా యూనివర్సిటీ నుండి ఎంఏ డిగ్రీ ఆర్ట్ అండ్ డిజైన్ విభాగంలో డిగ్రీ పొందింది. మిహీక కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. మిహీక బజాజ్ తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉంటారు. ఉన్నతమైన ఫ్యామిలీ. తల్లి పేరు బంటీ బజాజ్ కాగా తండ్రి పేరు సురేష్ బజాజ్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మాయి తండ్రి పేరు కూడా సురేష్. ఇక ఓ సోదరుడు ఉన్నాడు అతని పేరు సామ్రాట్. 2017లో సొంతంగా ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ కంపెనీని స్థాపించి యంగ్ బిజినెస్ ఉమెన్‌గా సత్తా చాటుతోంది మిహీక. ఒక వైపు తల్లి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చూస్తూనే.. తాను సొంతంగా రన్ చేస్తున్న ఇంటీరియల్ డిజైన్ కంపెనీ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది మిహికా. మొత్తానికి ఈ ఏడాది రానా-మిహీక ఒకటి కానున్నారు.