Begin typing your search above and press return to search.
షాక్: 8ఏళ్లలో 142కోట్లు ఆర్జించిన హీరో
By: Tupaki Desk | 5 Jan 2019 5:14 PM GMTడబ్బు టు ద పవరాఫ్ డబ్బు! సంపద సంపదల్ని పెంచుతుంది!! ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ప్రవచించిన సూత్రమిది. అయితే డబ్బు డబ్బును పెంచి పోషించినా నిలబెట్టాలి కదా? ఈ విషయంలో ది గ్రేట్ లెజెండరీ ఫిలింమేకర్ - మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు మనవడు రానా ఆల్వేస్ గ్రేట్ అనే చెప్పాలి. తాత పేరులోని రెండక్షరాలతో `రానా` అని పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు నిలబెడుతూ ఆస్తుల్ని పెంచి పోషిస్తున్నాడు ఈ యంగ్ హీరో.
టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరో రానా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అతడే. అదొక్కటే కాదు.. కేవలం ఎనిమిదేళ్లలో అతడు తనని తాను యూనివర్శల్ స్టార్ గా తీర్చి దిద్దుకోవడమే గాక - ఇప్పుడు నలుగురూ తన బాటను అనుసరించేంతగా గొప్ప మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. కేవలం యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథల్ని ఎంచుకుని కాంపిటీషన్ లో ఇతర హీరోలు తన రేంజును టచ్ చేయలేని లెవల్ కి ఎదగాలని ప్లాన్ వేశాడు.
అంతేకాదు.. రానా కేవలం కెరీర్ ప్లానింగ్ లోనే కాదు.. ఇప్పటివరకూ అతడు పెంచి పోషించిన సంపద విలువ తెలిస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. తాత సంపాదించినది.. డాడ్ డి.సురేష్ బాబు సంపాదించినది అతడు ఖర్చు చేయలేదు. సరికదా తనకు ఇచ్చిన ఆస్తుల్ని మరింతగా పెంచాడు. ఇప్పటికి రానా పేరున ఏకంగా 142కోట్ల ఆస్తులు ఉన్నాయిట. ఒక గొప్ప కుటుంబ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాడు అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏడాదికి రూ.6-8 కోట్ల మినిమం వార్షికాదాయంతో దూసుకుపోతున్న రానా - అంతకంతకు తన ఆదాయ మార్గాల్ని పెంచుకుంటున్నాడు. సినిమాలు, వాణిజ్య ప్రకటనల రూపంలో ఆర్జన పెంచుకుంటున్నాడు. 2010లో `లీడర్` చిత్రంతో కెరీర్ ప్రారంభించి - 2018 నాటికి అతడు సాధించిన ఘనత ఇది. సొంత ఇల్లు - సొంత లగ్జరీ కార్లు అతడి సొంతం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 4.8 కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. 2.73కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ - అలానే 1.32కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ అతడి సొంతం. అతడు వాడే వాచ్ ల ఖరీదు లక్షల్లోనే. హ్యూబ్లోట్ మెక్సికన్ బ్రాండ్ వాచ్ ఖరీదు 8.16లక్షలు.. అలాగే టీఏజీహ్యూర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ ఖరీదు 3.25లక్షలు.. ఉంటుంది. అలాగే అతడి వద్ద ఖరీదైన వస్తువులు ఇంకెన్నో ఉన్నాయి. అతడు ఈ ఆస్తుల్ని ఏనిమిదేళ్లలో సంపాదించాడా? అంటే సంపాదించాడని చెప్పకపోయినా, అతడి ముఖవిలువ అంత ఉంది అని కన్ఫామ్ గా చెప్పగలం. ప్రస్తుతం హాథీ మేరా సాథీ, హౌస్ ఫుల్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు. హిరణ్యకసిప వంటి భారీ ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అతడు సీఎం చంద్రబాబు పాత్రలో నటించిన `కథానాయకుడు` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.