Begin typing your search above and press return to search.
ప్రభాస్ దెబ్బలు రానాకి పనికొచ్చాయ్
By: Tupaki Desk | 25 April 2017 4:58 AM GMTబాహుబలి2 మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నా.. ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలవుతుండడంతో.. మూవీ యూనిట్ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజిగా ఉన్నారు. భల్లాలదేవుడు పాత్రధారి రానా.. ప్రస్తుతం కొచ్చిలో ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాడు. బాహుబలి చేస్తూనే.. ఇతర సినిమాలు చేసే అవకాశం ఎలా వచ్చిందో చెప్పాడు రానా.
నిజానికి ప్రభాస్ తప్ప బాహుబలిలోని మిగిలిన అందరు యాక్టర్స్ ఇతర చిత్రాలు కూడా చేసుకున్నారు. రానా అయితే.. తెలుగులో రుద్రమదేవి.. హిందీలో బేబీ.. తమిళ్ లో బెంగళూరు డేస్.. త్రిభాషా చిత్రం ఘాజీల్లో నటించాడు. బాహుబలి కోసం బాడీ పెంచేందుకు.. దాన్ని మెయింటెయిన్ చేసేందుకు ప్రభాస్.. రానాలు తెగ కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభాస్ కు గాయాలు అయ్యాయట. దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే రుద్రమదేవి మూవీ చేశా అంటున్నాడు రానా.
'అప్పటికే పెద్ద యుద్ధం చేస్తున్నాను.. మరో చిన్న యుద్ధం చేస్తే ఏమవుతుంది అనుకున్నా. అప్పటికే పొడుగు జుట్టు పెంచి ఉండడంతో.. దీనికి కూడా పనికొచ్చింది. బేబీ సినిమా కూడా అలాగే చేశా' అన్నాడు రానా. నిజానికి ప్రభాస్ కంటే ముందే రానాకు కూడా గాయాలయ్యాయ్ కానీ.. రానాకు తగిలిన దెబ్బలు చిన్నవే. అందుకే సింపుల్ రోల్స్ ను కంప్లీట్ చేసేయగలిగాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/