Begin typing your search above and press return to search.
'రానా నాయుడు' తొడగొట్టే వెబ్ సిరీసే!
By: Tupaki Desk | 4 March 2022 4:41 AM GMTచూస్తుండగానే వెబ్ సిరీస్ ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో వినోదాన్ని అందించే విషయంలో వెబ్ సిరీస్ ల పరిథి .. శాతం పెరుగుతూ పోతోంది. మొదట్లో వెబ్ సిరీస్ లపై చులకన భావం ఉండేది. టీవీ సీరియల్స్ చేసేవారు నిజంగానే చాలా సంతోషపడ్డారు .. తమకి మరో మార్గం కూడా అందుబాటులోకి వచ్చినందుకు. ఆ తరువాత సినిమాల్లో కొంతదూరం ప్రయాణం చేసి .. అంతగా అవకాశాలు లేని వారు కూడా వెబ్ సిరీస్ లపై ఆశపడరు .. ఆశ్రయించారు. సినిమాల్లో స్టార్స్ స్థాయిలో ఉన్నవారు మాత్రం ఆ వైపు అంతగా చూడలేదు. అవి తమ స్థాయికి తగినవి కావనే ఉద్దేశంతో అంతగా పట్టించుకోలేదు.
కానీ ఓటీటీల వైపు నుంచి వచ్చిన మార్పులు వెబ్ సిరీస్ లను ప్రభావితం చేశారు. బడ్జెట్ పరంగా .. సాంకేతికత పరంగా .. ఆర్టిస్టుల పరంగా వెబ్ సిరీస్ లు తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్లడం మొదలైంది. కంటెంట్ విషయంలో .. క్వాలిటీ విషయంలో వెబ్ సిరీస్ లు సినిమాల స్థాయిలో ఉంటూ ఉండటం .. వాటికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ పెరుగుతూ పోతుండటంతో ఈ దిశగా స్టార్స్ అడుగులు వేశారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ లో చైతూ నటిస్తున్నాడు.
ఇక వెంకటేశ్ - రానా ఇద్దరూ కూడా నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఒక భారీ వెబ్ సిరీస్ చేస్తున్నారు. కరణ్ అన్షుమన్ - సుపర్ణ వర్మ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ కావొచ్చునని అంటున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా 'రే డోనొవన్' ఆధారంగా ఇది రూపొందుతోంది. నిజానికి వెంకటేశ్ - రానా కాంబినేషన్లో మల్టీ స్టారర్ వస్తుందని అంతా ఆశించారు. కానీ అంతకంటే ముందుగానే వాళ్ల నుంచి ఈ వెబ్ సిరీస్ వస్తుండటం విశేషం. ఈ వెబ్ సిరీస్ ను ఎనౌన్స్ చేసిన తరువాత, పెద్దగా అప్ డేట్స్ ఇవ్వలేదు.
తాజాగా రానా మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోందని చెప్పాడు. 'భీమ్లా నాయక్' ప్రమోషన్స్ సమయంలో తాను ఎక్కువగా కనపడకపోవడానికి కారణం ఈ వెబ్ సిరీస్ షూటింగులో ఉండటమేనని అన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ రోజున కూడా తాను ముంబైలో షూటింగు ఉన్నానని చెప్పాడు. షూటింగు అయిన తరువాత అప్పుడు ఈ సినిమాను చూశానని చెప్పాడు. ఇది 8 గంటలపాటు సాగే సుదీర్ఘమైన వెబ్ సిరీస్ అనే విషయాన్ని స్పష్టం చేశాడు. సాధారణంగా 3 నుంచి 5 గంటల వరకూ వెబ్ సిరీస్ లు ఉంటూ ఉంటాయి. 8 గంటల వెబ్ సిరీస్ అంటే ఎక్కువ నిడివే అనుకోవాలి మరి!