Begin typing your search above and press return to search.

రానా వాయిస్‌ తో హైప్‌ పెంచే ప్రయత్నం

By:  Tupaki Desk   |   1 Dec 2018 10:14 AM GMT
రానా వాయిస్‌ తో హైప్‌ పెంచే ప్రయత్నం
X
సుమంత్‌ హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుబ్రమణ్యపురం’ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ట్రైలర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘కార్తికేయ’ మూవీకి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తోంది అంటూనే ప్రేక్షకులు ఈ ట్రైలర్‌ గురించి చర్చిస్తున్నారు. సినిమాలో మ్యాటర్‌ ఉన్నట్లే అనిపిస్తుందనే పాజిటివ్‌ టాక్‌ మొదలైంది. ఇలాంటి సమయంలో సినిమాకు మరింత హైప్‌ తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు రానాతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించేందుకు సిద్దం అయ్యారు.

ఈమద్య కాలంలో రానా తన వాయిస్‌ ను తెగ అరువు ఇచ్చేస్తున్నాడు. హాలీవుడ్‌ మూవీ అవెంజర్స్‌ తెలుగు వర్షన్‌ లో రానా వాయిస్‌ వినిపించిన విషయం తెల్సిందే. ఇంకా పలు తెలుగు చిత్రాలకు కూడా రానా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. రానా వాయిస్‌ లో బేస్‌ బాగుంటుందని, అందుకే ఈయనతో వాయిస్‌ ఓవర్‌ చెప్పిస్తున్నారు. తాజాగా సుమంత్‌ కూడా రానాను తన సినిమాకు వాయిస్‌ ఓవర్‌ చెప్పాల్సిందిగా కోరాడట. అందుకు రానా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. సినిమా రానా వాయిస్‌ ఓవర్‌ తో ప్రారంభం అయ్యి, రానా వాయిస్‌ తోనే ముగుస్తుందట. రానా వాయిస్‌ ఓవర్‌ తో పాటు, ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌ మరియు స్టోరీ లైన్‌ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తాయనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఈ చిత్రంలో సుమంత్‌ తో ఈషా రెబ్బ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.