Begin typing your search above and press return to search.

వాళ్ళని మేనేజ్ చేయడానికి రానా కంపెనీ

By:  Tupaki Desk   |   5 Jan 2017 1:10 PM GMT
వాళ్ళని మేనేజ్ చేయడానికి రానా కంపెనీ
X
టాలీవుడ్ లో ప్రస్తుతం స్ట్రాంగ్‌ గా నడుస్తున్న వాటిలో మేనేజర్ల వ్యవస్థ కూడా ఒకటి. ఆర్టిస్టుల డేట్లు.. రేట్లు.. కాల్షీట్లు సెట్ చేయడం.. ఏదైనా సమస్య వచ్చి షూటింగ్ డేట్స్ లో తేడావస్తే సర్దుబాటు చేయడం.. నిర్మాతలు-ఆర్టిస్టుల మధ్య సమన్వయం కుదర్చడం వీరి పని. ఇదంతా చేసినందుకు వీరికి ఆయా ఆర్టిస్టుల పారితోషికాల్లో 20-30 శాతం కమీషన్ గా ముడుతుంది.

పలు కీలక ప్రాజెక్టుల్లో భాగం అయేలా పావులు కదపడం అనే పాత్ర కూడా మేనేజర్లు నిర్వహిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ మేనేజర్ల వ్యవస్థకు గండం వాటిల్లబోతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి. దగ్గుబాటి రానా నటుడే అయినా.. నిర్మాణ రంగంలోంచి రావడంతో వ్యాపార దృక్పథం బాగా ఎక్కువ. తాజాగా రానా ట్యాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆలోచన చేశాడు. క్వాన్ పేరుతో ఏర్పాటయ్యే ఈ సంస్థకు సౌత్ హెడ్ గా రానానే వ్యవహరించనున్నాడు.

మేనేజర్ల స్థానంలో ఆర్టిస్టులనే ఉపయోగించుకోవాలన్నది ఇతని ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్వాన్ కంపెనీయే ఆర్టిస్టుల ప్రాజెక్టులతో పాటు ఇతర కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తుంది. కేవలం సౌత్ నుంచి మాత్రమే కాకుండా.. నార్త్ నుంచి కూడా నటీనటులకు చెందిన డేట్స్ - షెడ్యూల్స్ ను ఈ కంపెనీ చూసుకుటుంది. రానా చేసిన ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం సీరియస్ గా చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తో పలుమార్లు చర్చలు జరిపాకే.. ఈ ఆలోచనకు వచ్చాడట రానా. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పేరుతో.. కొత్త ట్యాలెంట్ ను పరిచయం చేసే కంపెనీనీ పూరీ జగన్నాధ్ నిర్వహిస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలతో మేనేజర్ల వ్యవస్థకు గండం రానుందని కొందరు అంటున్నా.. ఇదేమీ సక్సెస్ అయ్యే ఆలోచన కాదని.. తమకు ఎలాంటి సమస్య రాబోదని ప్రస్తుతం మేనేజర్లుగా ఉన్నవారు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/