Begin typing your search above and press return to search.
రానాకి సమంత... చైతూకి రకుల్
By: Tupaki Desk | 12 Oct 2015 10:30 PM GMTకొత్త కాంబినేషన్ల కాలం నడుస్తోందిప్పుడు. దర్శకులు - హీరోలు - హీరోయిన్లు... ప్రేక్షకుల ఊహలకి భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. స్టార్ దర్శకులు చిన్న హీరోలతో సినిమాలు తీస్తున్నారు. స్టార్ హీరోలు చిన్న దర్శకులకి ఓకే చెప్పేస్తున్నారు. హీరోయిన్లూ చిన్న - పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ కలిసి నటిస్తున్నారు. అందుకే కథల్లో కాకుండా కాంబినేషన్ లలోనే కొత్తదనం చూసుకొంటున్నారు ప్రేక్షకులు.
ఆరడుగుల అందగాడు రానా ఇప్పుడు సమంతతో జోడీ కట్టబోతున్నాడు. వీళ్లిద్దరూ బెంగళూరు డేస్ రీమేక్ లో నటించారు. అయితే అందులో బోలెడు మంది హీరోలు, బోలెడుమంతి హీరోయిన్లున్నారు. మరి వాళ్ల మద్య ఈ జోడీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియదు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మాత్రం మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. వీళ్లిద్దరి కోరిక వల్లే ఆ ప్రాజెక్టుకూడా ఓకే అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే సంకల్ప్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రానా. ఇదో డిఫరెంట్ సినిమా. ఇండియా – పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ సబ్ మెరైన్ మిస్టరీని తెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషి స్తున్న చిత్ర బృందం .. సమంతను సంప్రదించినట్లు తెలిసింది. సమంత కూడా చిత్రానికి డేట్లు సర్దుబాటు చేసే పనిలో వుందని సమాచారం. ఆరున్నరడుగుల ఎత్తున్న అబ్బాయి రానా పక్కన సమంత ఎలా కనిపిస్తుందో చూడాలి మరి
అయితే ఆరడుగుల ఎత్తున్న హీరోల పక్కన సూపర్ గా ఉంటుందనిపించే రకుల్ మాత్రం నాగచైతన్యతో జోడీ కట్టింది. నాగచైతన్య కథానాయకుడిగా మజ్ను అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది ప్రేమమ్ కి రీమేక్. ఇందులో కథానాయికలుగా ఇప్పటికే శ్రుతిహాసన్ - అనుపమ పరమేశ్వర్ లు ఎంపికయ్యారు. వీరికితోడుగా రకుల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మూడో హీరోయిన్ కోసం చిత్రబృందం ఎప్పట్నుంచో అన్వేషిస్తోంది. చివరిగా రకుల్ ని సంప్రదించారట. చిన్న పాత్రే కాబట్టి ఆమె వెంటనే డేట్లు అడ్జస్ట్ చేసి ఓకే అని చెప్పిందట. సో... ఈ రకంగా మరో రెండు కొత్త జోడీలు తెరపై సందడి చేయబోతున్నాయన్నమాట.