Begin typing your search above and press return to search.

రణరంగం సౌండ్ కట్.. వాట్ ఎ సౌండ్

By:  Tupaki Desk   |   11 Aug 2019 4:26 PM IST
రణరంగం సౌండ్ కట్.. వాట్ ఎ సౌండ్
X
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్.. కళ్యాణి ప్రియదర్శన్.. కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ సినిమా ఆగష్టు 15 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షకులలో ఆసక్తి పెంచిన ఈ చిత్రం నుండి తాజాగా 'సౌండ్ కట్' ను విడుఅల చేయడం జరిగింది. శర్వానంద్ స్నేహితుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సౌండ్ కట్ ను విడుదల చేయడం విశేషం.

సౌండ్ కట్ అంటే తెలియని వారు ఇదేంటోనని తికమక పడాల్సిన అవసరం లేదు. సినిమాలోను పలు సీన్లలో సౌండ్ ఎఫెక్ట్స్ ను ఒక ప్రత్యేకమైన ట్రైలర్ లాగా కట్ చేయడమే ఈ సౌండ్ కట్. పేరుకు విజువల్స్ ఉంటాయి కానీ ప్రాధాన్యత అంటే బ్యాక్ గౌండ్ స్కోర్ దే ఉంటుంది. సముద్రపు అలల హోరులో పక్షుల అరుపులు. షూట్ చేసిన తర్వాత బాడీ నీటిలో పడిన శబ్దం.. గ్లాసును నేలకేసి కొడితే భళ్ళున విరిగిన సౌండ్.. సిగరెట్ కాల్చడానికి లైటర్ వెలిగిస్తే వచ్చే శబ్దం.. కారు తగలడుతూ ఉంటే వచ్చే మంటల సవ్వడి.. కార్లు రివ్వున దూసుకు పోతూ ఉన్నప్పుడు వచ్చే ధ్వని ఇలా మీరు పరిశీలిస్తే ప్రతి ఫ్రేం లో సౌండ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా ఇవన్నీ సాధారణ ప్రేక్షకులు అబ్జర్వ్ చేయరు.

ఇప్పుడు ప్రత్యేకంగా సౌండ్ కట్ రిలీజ్ చేశారు కాబట్టి.. ఒకవేళ మీరు అంత నిశితంగా పరిశీలించని వారిలో ఒకరైతే.. పరిశీలించండి. రెండు మూడు సార్లు రిపీట్ మోడ్ లో వింటే 'వావ్' అనకుండా ఉండలేరు. సౌండ్ గురించి ఇంత మాట్లాడుకున్నాం.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పుకోకపోతే ఎలా? ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.. ప్రశాంత్ పిళ్ళై. ఈ సౌండ్ కట్ వినే సమయంలో వీలుంటే.. కుదిరితే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని చిన్న విన్నపం.