Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : మృత్యువుతో రణం

By:  Tupaki Desk   |   29 Jun 2019 4:03 PM IST
టీజర్ టాక్ : మృత్యువుతో రణం
X
కాస్త లేట్ అయినా ఏదో ఒక వైవిధ్యం లేకపోతే కథలు ఒప్పుకోని శర్వానంద్ కొత్త సినిమా రణరంగం టీజర్ ఇందాక విడుదలైంది. కాన్సెప్ట్ ని చూచాయగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎక్కడో దూరంగా దేశం కానీ దేశంలో మాఫియా సామ్రాజ్యంలో ఉంటాడు దేవా(శర్వానంద్). దేవుణ్ణి నమ్మాలంటే భక్తి కావాలి మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి అని నమ్మే దేవా చుట్టూ ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదాలు పొంచి ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలని ఓ అమ్మాయి(కాజల్ అగర్వాల్)ప్రయత్నిస్తుంది.

కట్ చేస్తే స్టోరీ 1990స్ లోకి వెళ్తుంది. స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడుపుతూ ప్రేమ(కళ్యాణి ప్రియదర్శన్)లో మునిగి తేలుతూ పోర్ట్ ఏరియాలో ఉంటాడు దేవా. అప్పుడు స్థానికంగా ఉండే ముఠాలతో దేవాకు వైరం ఏర్పడుతుంది. చెలగాటం మొదలుపెడతాడు. అసలు దేవా ప్రస్థానం ఎక్కడిదాకా వెళ్ళింది విదేశాలకు ఎందుకు వెళ్ళాడు లాంటి ప్రశ్నలకు సమాధానం రణరంగం

మాఫియా బ్యాక్ డ్రాప్ తో టీజర్ లో మంచి ఇంటెన్సిటీ చూపించాడు దర్శకుడు సుధీర్ వర్మ. టూ షేడ్స్ లో శర్వానంద్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. రెండు కాలాలకు సంబంధించిన కథ కావడంతో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ దక్కింది. ఒక్క ఫ్రేమ్ లో మాత్రమే రివీల్ చేశారు. ఇద్దరు హీరో ఫ్రెండ్స్ ని తప్ప ఇంకే పాత్రను బయటపెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం ప్రశాంత్ పిళ్ళై సంగీతం సబ్జెక్టులోని మూడ్ ని చక్కగా క్యారీ చేశాయి. ఆగష్టు లో విడుదల కాబోతున్న రణరంగం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందింది