Begin typing your search above and press return to search.

`ర‌ణ‌రంగం` వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీ బిజినెస్

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:25 AM GMT
`ర‌ణ‌రంగం` వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీ బిజినెస్
X
శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ర‌ణ‌రంగం` ఈ గురువారం (ఆగ‌స్టు 15)న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాట‌లు.. ట్రైల‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. శ‌ర్వా తొలిసారి గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించిన ఈ సినిమాపై రిలీజ్ ముందే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌యోగం చేసినా హిట్ కొడ‌తానన్న ధీమా శ‌ర్వాలోనూ క‌నిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిసాయి.

ప్రాంతాల వారీగా ప్రీబిజినెస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం-5 కోట్లు, వైజాగ్-1.5 కోట్లు, తూ.గో జిల్లా-1 కోటి, ప‌.గో జిల్లా-80ల‌క్ష‌లు, కృష్ణ‌-1కోటి, గుంటూరు-1.2కోట్లు, నెల్లూరు-50ల‌క్ష‌లు, సీడెడ్-2 కోట్లు మేర బిజినెస్ చేసారు. నైజాం-ఏపీ క‌లుపుకుని 13 కోట్ల (సుమారు) బిజినెస్ చేశారు. క‌ర్నాట‌క‌-90ల‌క్ష‌లు, ఇత‌ర భార‌త‌దేశం-30 ల‌క్ష‌లు, ఓవర్సీస్-1.8 కోట్లు గా రైట్స్ విక్ర‌యించారు. వ‌ర‌ల్డ్ వైడ్ -16 కోట్ల బిజినెస్ సాగింది. ప్రింట్లు, ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు కాక సాగిన బిజినెస్ ఇది.

ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలంటే 24 కోట్లు పైగా వ‌సూలు చేయాలి. సూప‌ర్ హిట్ అవ్వాలంటే 19.2-23.99కోట్లు.. హిట్ అవ్వాలంటే 16- 19.19కోట్లు.. అబౌ యావ‌రేజ్ అని చెప్పాలంటే 14.4- 15.99కోట్లు వ‌సూలు చేయాలి. యావ‌రేజ్ అని చెప్పాలంటే 12.8-14.39 కోట్లు వ‌సూలు చేయాలి. 10.67-12.79 కోట్లు మ‌ధ్య వ‌సూలు చేస్తే ఫ్లాపైన‌ట్టే. 10.67 కోట్ల కంటే తక్కువ షేర్ వ‌స్తే డిజాస్ట‌ర్ అయిన‌ట్టు అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.