Begin typing your search above and press return to search.
శర్వా VS శేషు - ఎవరికి ప్లస్
By: Tupaki Desk | 31 July 2019 7:41 AM GMTప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం మూడు స్ట్రెయిట్ సినిమాలు తలపడే పరిస్థితి రాను రాను అలవాటుగా మారుతోంది. పోటీలో ఎవరు ఉన్నా తాము అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలన్న నిర్ణయాలు ఒకసారి వసూళ్లను దెబ్బ తీస్తున్నా ఆ దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. ఈ వారం రాక్షసుడు - గుణ 369 రేస్ లో ఉండగా రెండు వారాల తరువాత రణరంగం-ఎవరు మధ్య యుద్ధం జరగబోతోంది. ఒకరకంగా చెప్పాలంటే శర్వానంద్ వెర్సెస్ అడవి శేష్ అని చెప్పొచ్చు.
వాస్తవంగా పరిశీలిస్తే శర్వాకున్న మార్కెట్ శేష్ కు లేదు. యూత్ లోనూ ఫామిలీస్ లోనూ శర్వానంద్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. పడి పడి లేచే మనసు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కేవలం తన ఇమేజ్ మీదే అంతో ఇంతో బెటర్ రన్ రాబట్టుకోగలిగింది. ఈ నేపథ్యంలో రణరంగంకు తనే ఫస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతున్నాడు. ఇక దర్శకుడు సుధీర్ వర్మ ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. టీజర్ తో పాటు రెండు ఆడియో సింగిల్స్ ఇప్పటికే దీని మీద మంచి ఇంప్రెషన్ కలిగించాయి.
ప్రస్థానం తర్వాత అంతకన్నా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న డ్రామా మూవీ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఎవరు విషయంలో ఇది రివర్స్ లో ఉంది. బజ్ లేదు. టైటిలే ఏదో డబ్బింగ్ మూవీ అనేలా పెట్టారు. దానికి తోడు ఫామ్ లో లేని రెజీనా కీలక పాత్ర కావడంతో పాటు కేవలం థ్రిల్లర్స్ మాత్రమే చేస్తున్న శేష్ హీరోగా నటించడం అన్ని వర్గాలకు రీచ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. లో బడ్జెట్ లో తీసిన మూవీ అనే అభిప్రాయం కూడా జనంలో ఉండటం కొంతవరకు మైనస్ గా నిలుస్తోంది. సో శర్వా హవాను తట్టుకుని నిలవడం శేష్ కు అంత ఈజీగా అయితే ఉండదు.