Begin typing your search above and press return to search.

నాగ్-అమ‌ల జోడీని ఆకాశానికి ఎత్తేసిన న‌వ‌దంప‌తులు!

By:  Tupaki Desk   |   5 Sep 2022 5:50 AM GMT
నాగ్-అమ‌ల జోడీని ఆకాశానికి ఎత్తేసిన న‌వ‌దంప‌తులు!
X
బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం 'బ్ర‌హ్మ‌స్ర్త' ప్రచారం పీక్స్ కి చేరుకుంది. రిలీజ్కి ఇంకా నాలుగైదు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో దొరికిన ఏ వేదిక‌ని విడిచిపెట్ట‌డం లేదు. సినిమాకి వీలైనంత బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైల‌ర్ పై వ‌చ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ని తొల‌గిస్తూ... సినిమా పైకి లేపే ప్ర‌య్న‌తం చేస్తున్నారు. ఇప్ప‌టికే యూనిట్ అన్ని మెట్రోపాలిట‌న్ సిటీల‌ను చుట్టేసింది.

ర‌ణ‌బీర్ క‌పూర్..అలియాభ‌ట్ ఉత్త‌రాది రాష్ర్టాల్ని టార్గెట్ చేస్తూ..నాగార్జున‌..రాజమౌళి ద‌క్షిణాది రాష్ర్టాల్ని చుట్టేసారు. వాళ్లిద్ద‌రితో పాటు ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా పాల్గొన్నారు. రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైన నేప‌థ్యంలో న‌వ దంప‌తులు బాలీవుడ్ మీడియాని చుట్టేస్తున్నారు. ఏ టీవీ ఛానెల్ ని విడిచి పెట్ట‌డం లేదు. తాజాగా బిగ్ బాస్ ని చుట్టేసారు.

బిగ్ బాస్ ఆరవ సీజన్ కర్టెన్ రైజర్ సందర్భంగా రణబీర్ మరియు అలియా బ్రహ్మస్త్ర గురించి ఆసక్తిక‌ర విషయాలను పంచుకున్నారు. ఈ షోలో రణబీర్ క‌పూర్ తెలుగులో మాట్లాడ‌టం.. అలియా భ‌ట్ తెలుగు వెర్ష‌న్ కేసరియా పాట ఆల‌పించ‌డం విశేషం. ఈ రెండు స‌న్నివేశాలు బిగ్ బాస్ సెట్ లో హైలైట్ గా నిలిచాయి. అలాగే కింగ్ నాగార్జునపై దంప‌తులిద్ద‌రు ప్రశంసలు కురిపించారు.

రణబీర్ నాగార్జున‌ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉందని చెప్ప‌డం విశేషం. కింగ్ ప‌నిత‌నాన్ని.. సినిమాల ప‌ట్ల ఆయ‌న‌కున్న అంకిత‌భావం గురించి ర‌ణ‌బీర్ ఎంతో చ‌క్కగా ఉంద‌న్నారు. ''మేము ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే జంట ఏదైనా ఉంది అంటే? అది నాగార్జున‌-అమ‌ల మేమ్ జోడీనే. అమల మామ్‌కి ఉన్న విలువలు నిజంగా ఎంతో ఉన్న‌త‌మైన‌వి.

ఆ జంట సంత‌క్ష‌సంగా ఉండాల‌ని కోర‌కుంటున్నాను' అని అన్నారు. అలాగే బ్రహ్మాస్త్ర క్లైమాక్స్‌ను చూసి నాగార్జున‌తో వారి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.

బిగ్ బాస్ సెట్ కి సంబంధించిన ప్రశ్న‌కి ర‌ణ‌బీర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఒక ఫన్నీ నోట్‌లో రణబీర్ బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు సంతోషంగా జీవించగలనని వెల్లడించారు. అయితే అలియాభ‌ట్..నాగార్జున మాత్రం త‌న‌లా అన్ని రోజులు సెట్ లో ఉండ‌లేర‌న్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.