Begin typing your search above and press return to search.
మాజీ బాయ్ ఫ్రెండ్ కు తల్లిగా బాలీవుడ్ బ్యూటీ..!
By: Tupaki Desk | 16 Sep 2022 10:34 AM GMTబాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''బ్రహ్మాస్త్రం''. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున - అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి కష్టపడుతోంది.
'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నట్లు రిలీజ్ కు ముందే మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ని 'బ్రహ్మాస్త్రం: శివ' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అగ్ని అస్త్రగా డీజే శివ గా నటించిన రణబీర్ కపూర్ చుట్టూనే కథంతా నడుస్తుంది. చివర్లో అమృతగా, జల్ అస్త్రంగా దీపికా పదుకొణెని పరిచయం చేశారు.
అమృత అనేది శివ తల్లి పాత్ర. అంటే దీపికా పడుకునే ఈ సినిమాలో రణబీర్ కపూర్ కు మదర్ గా కనిపించనుందన్నమాట. రణబీర్ - దీపికా గతంలో ప్రేమికులనే సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొని చెరొక పార్టనర్ ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' సినిమా కారణంగా తన మాజీ బాయ్ ప్రెండ్ కి దీపికా తల్లి పాత్ర పోషించాల్సి వస్తోంది.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీపికా భర్త రణవీర్ సింగ్ ఈ సినిమాలో రణబీర్ కు తండ్రిగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. రెండో భాగాన్ని ''బ్రహ్మాస్త్రం: దేవ్'' పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దేవ్ అనేది ఇందులో శివ తండ్రి పాత్ర. ఈ క్యారక్టర్ లో ఎవరు నటిస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఆ పాత్రలో నటించేది రణ్ వీరే అని బాలీవుడ్ వర్గాలు స్ట్రాంగ్ గా చెబుతున్నాయి. దీనిని బట్టి 'బ్రహ్మాస్త్ర' రెండో భాగంలో రణబీర్ కపూర్ కు తల్లిదండ్రులుగా రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకునే కనిపించనున్నారు. అయితే వీరి కాంబినేషన్లో సీన్లు ఉంటాయో లేదే చెప్పలేం.
మొదటి భాగం కథ ప్రకారం, బ్రహ్మాస్త్రాన్ని రక్షించడానికి శివ తండ్రి దేవ్ మరియు తల్లి అమృత ఒకరితో ఒకరు పోరాడారు. దేవ్ తన స్వార్థ కోరికల కోసం ఆయుధాన్ని ఉపయోగించాలనుకున్నట్లు సూచించారు. రణవీర్ - దీపికాలను స్పష్టంగా చూపించలేదు.
కాకపోతే 'బ్రహ్మాస్త్ర 2' సినిమాలో దేవ్ - అమృత పాత్రలు ప్రధానంగా ఉంటాయని అర్థమవుతుంది. ఒక రకంగా ఇది 'బ్రహ్మాస్త్ర' పార్ట్-1 కు ప్రీక్వెల్ అని అనొచ్చు. త్వరలో రణవీర్ సింగ్ పాత్రపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ - స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ వంటి నాలుగు దక్షిణాది బాషల్లో సమర్పించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.