Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ ట్రెండ్ పై ర‌ణ్ బీర్ తెలివిగా స్పందించాడే!

By:  Tupaki Desk   |   8 Sep 2022 12:41 PM GMT
బాయ్ కాట్ ట్రెండ్ పై ర‌ణ్ బీర్ తెలివిగా స్పందించాడే!
X
బాలీవుడ్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోందంటే చాలు నెట్టింట బాయ్ కాట్ ట్రెండ్ మొద‌ల‌వుతోంది. ఏ సినిమా సినిమా విడుద‌లైనా స‌రే వారం ప‌ది రోజుల‌కు ముందు బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ గా మారుతూ నెట్టింట హంగామా చేస్తోంది. #boycottbollywood ట్రెండ్ వైర‌ల్ గా మార‌డంతో ఇటీవ‌ల రణ్ బీర్ క‌పూర్ న‌టించిన `షంషేరా`, అమీర్‌ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌డ్డా`, అక్ష‌య్ కుమార్ న‌టించిన `ర‌క్షా బంధ‌న్‌` సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ లు మారిన విష‌యం తెలిసిందే.

తాజాగా #boycottbollywood ట్రెండ్ `బ్ర‌హ్మాస్త్ర‌`ని కూడా తాకింది. ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, మౌనీరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించాడు. భారీ బ‌డ్జెట్ తో హిందూ పురాణాల ఆధారంగ ఈ మూవీని మూడు భాగాలుగా తెర‌కెక్కించారు. క‌ర‌ణ్ జోహార్ తో పాటు ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ మ‌రికొంత మంది నిర్మాత‌లు క‌లిసి నిర్మించిన ఈ మూవీలోని ఫ‌స్ట్ పార్ట్ మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

తెలుగు వెర్ష‌న్ కు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీని కూడా #boycottbollywood ట్రెండ్ వెంటాడుతోంది. నెట్టింట నెటిజ‌న్ లు, బాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్ `బ్ర‌హ్మ‌స్త్ర‌`ని ట్రోల్ చేస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉజ్జ‌య‌ని మ‌హ‌కాళేశ్వ‌ర్ టెంపుల్‌కి వెళ్లిన అలియా, ర‌ణ్ బీర్‌, అయాన్ ముఖ‌ర్జీల‌కు కొంత మంది న‌ల్క‌ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం తో అక్క‌డ ఉద్ర‌క్త‌త చోటు చేసుకుంది.

నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఓ వ్య‌క్తిని పోలీసులు ప్ర‌తిఘ‌టించి చిత‌క‌బాదిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా వుంటే #boycottbollywood ట్రెండ్ పై హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ తెలివిగా స్పందించ‌డం విశేషం. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల‌ని కుదిపేస్తున్న #boycottbollywood ట్రెండ్ పై తాజాగా ర‌ణ్ బీర్ క‌పూర్ ఓ మీడియాతో ముచ్చ‌టిస్తూ స్పందించారు. ప్రేక్ష‌కులు ప్రేమిస్తే ఆ స‌నిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది.

నేను న‌టించిన `షంషేరా` ప్రేక్ష‌కుల్ని ఇంప్రెస్ చేయ‌లేక‌పోయింది. దాంతో ప్రేక్ష‌కులు సినిమాని పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. కంటెంట్ బాగుంటేనే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. మంచి సినిమాల‌ని థియేట‌ర్ల‌లో చూడ‌కూడ‌ద‌ని, థియేట‌ర్ల‌కు రాకూడ‌ద‌ని ప్రేక్ష‌కులు అనుకోరు క‌దా? అని తెలివిగా రిప్లై ఇచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.