Begin typing your search above and press return to search.
2020లో పెళ్లి సరే.. వెన్యూ ఎక్కడ?
By: Tupaki Desk | 10 Dec 2019 8:45 AM GMTఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. 2018-19 సీజన్ ఈ అమ్మడిదే. ఇప్పటికిప్పుడు ఆలియా లైనప్ చూస్తే షాకవ్వాల్సిందే. వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఓవైపు దర్శకధీరుడితో భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న ఈ భామ సేమ్ టైమ్ బ్రహ్మాస్త్ర లాంటి భారీ మల్టీస్టారర్ లోనూ నటించింది. బ్రహ్మాస్త్ర నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న రిలీజ్ కానుంది.
కెరీర్ సంగతి అటుంచితే.. అందాల ఆలియా ప్రేమాయణం గురించి తెలిసిందే. లవర్ బోయ్ రణబీర్ కపూర్ తో గత రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆలియా తొందర్లోనే అతడిని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. 2020లో ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారని ఇప్పటికే ప్రచారమవుతోంది. ఇంతకీ ఈ జోడీ పెళ్లి ఎక్కడ జరగనుంది... లొకేషన్ ఎక్కడ? అంటూ ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ తరహాలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ నే ప్లాన్ చేస్తున్నారా? అంటూ వాడి వేడిగా డిస్కషన్ నడుస్తోంది.
తాజాగా ఆలియా సన్నిహితుల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. ఈ భామ తన మనసుకు ఎంతో చేరువైన కశ్మీర్ లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. కశ్మీర్ తో ఆలియా అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. అక్కడే ఎగ్జోటిక్ లొకేషన్లలో రాజీ చిత్రం ఆద్యంతం తెరకెక్కింది. ఆ సమయంలో కశ్మీర్ తో ఈ అమ్మడు ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాతనే రణబీర్ తో ప్రేమ కుదిరింది. అందుకే ఇప్పుడు పెళ్లి కుదురుతోంది కాబట్టి తన మనసుకు ప్రశాంతతను ఇచ్చిన అదే లొకేషన్ కి వెళ్లి చేసుకోవాలన్నది ప్లాన్ అట. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ టైమ్ కి దీనిపైనా పూర్తి క్లారిటీ వచ్చేస్తుందని తెలుస్తోంది.