Begin typing your search above and press return to search.

కెన్యాలో వాలిన ప్రేమ పక్షులు

By:  Tupaki Desk   |   7 Sep 2019 1:30 AM GMT
కెన్యాలో వాలిన ప్రేమ పక్షులు
X
బాలీవుడ్ లో ఇప్పుడు మాంచి ఊపు మీద ఉన్న లవ్ జంట ఎవరు అంటే చిలిపి జనాలు అర్జున్ కపూర్ - మలైకా అని కొంటె జవాబు చెప్పే అవకాశం ఉంది కానీ వారు కాదు. రణబీర్ కపూర్ - అలియా భట్ ప్రస్తుతం హాట్ జోడీ. ఇద్దరికీ పోయినేడాదే వివాహం జరగాల్సి ఉందని.. కాకపోతే రణబీర్ నాన్నగారు రిషి కపూర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పెళ్ళి డిలే అయిందని బాలీవుడ్ లో టాక్ వినిపించింది.

సరే.. పెళ్ళి సమయం కనుక వస్తే ఎవరైనా చేసుకోవాల్సిందే. రణబీర్ - అలియాలు కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు. అయితే అందుకు వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటంటే రణబీర్ మనసు అంతలోపు మారకుండా ఉండాలి. ఆయనది అత్యంత చంచలమైన స్వభావమని చరిత్ర చెప్తోంది. మరి వివాహ ముహూర్తం లోపు ఏం జరుగుతుందో ఏమో కానీ ప్రస్తుతం ఈ లవ్ జంట కెన్యా లోని మాసయి మారా నేషనల్ రిజర్వ్ లో వైల్డ్ సఫారీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ నుంచి అలియా భట్ ఒక సూర్యోదయం ఫోటో పోస్ట్ చేసి "ఇక్కడ ఉదయం. కొత్త రోజు.. ఇక్కడి నుంచి కాంతి ప్రసరిస్తుంది" అంటూ ప్రేమలోలేని.. ప్రేమ వాసన అసలు తెలియని జనాలకు అర్థమయ్యి అర్థంకాని విధంగా ఓ కిరాక్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో కపూరు లేడు.. భట్టు జుట్టు మాత్రం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ప్రముఖుల ఫోటోలను సేకరించి అందరికంటే ముందుగా పబ్లిష్ చేసే ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని కపూరు - భట్టు ఇద్దరూ కలిసి ఉండే ఒక ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఒక జీప్ లో కూర్చుని ఇద్దరూ సఫారీని ఆస్వాదిస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపిస్తున్నారు. ఇద్దరినీ చూస్తుంటే త్వరలోనే డెస్టినేషన్ డుండుంపీపీ ఖాయమని అనిపిస్తోంది. ఏమంటారు..?