Begin typing your search above and press return to search.

రణబీర్ కపూర్ - అలియా భట్ పెళ్లిపై లీకులు

By:  Tupaki Desk   |   10 Aug 2021 1:30 PM GMT
రణబీర్ కపూర్ - అలియా భట్ పెళ్లిపై లీకులు
X
బాలీవుడ్ ప్రేమ జంట ర‌ణ‌బీర్ క‌పూర్ - ఆలియా భ‌ట్ పెళ్లెప్పుడు? ఈ ప్ర‌శ్న‌కు ఇన్నాళ్లు స‌రైన ఆన్స‌ర్ లేదు. 2020లో ఒక ఇంటర్వ్యూలో, రణబీర్ కపూర్ కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తాకక‌పోతే తాను అలియా భట్ ని పెళ్లాడేవాడిన‌ని ధృవీకరించాడు. రణబీర్ కపూర్ ప్రకటన తో ఇక ఈ వివాహం ఫిక్స‌యిన‌ట్టేన‌ని భావించారు. కానీ సరైన సమయం కోసం చూస్తున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైంది. తాజాగా బెల్ బాట‌మ్ ఫేం లారా దత్తా ఈ జంట వివాహంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. ఈ సంవత్సరం ఈ జంట పెళ్లి చేసుకుంటుందని నమ్ముతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

చాలా కాలంగా అలియా - రణబీర్ వివాహం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా లారా దత్తా ఈ ఏడాది వివాహం ఉండొచ్చు అంటూ కీల‌క‌ సమాచారాన్ని లీక్ చేసింది. సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ కు అధికారిక ఖాతా లేనప్పటికీ అలియా భట్ తరచుగా తన ప్రియుడి ఫోటోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. త‌మ జ‌ర్నీ కి సంబంధించిన స్నాప్ ల‌ను పంచుకుంటుంది ఆలియా.

రణబీర్ రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూలో అలియాతో తన వివాహ ప్రణాళికల గురించి మాట్లాడిన సంగ‌తి తెలిసిన‌దే. ఆలియాను 2020 లో వివాహం చేసుకోబోతున్నాన‌ని అయితే అప్పుడు కోవిడ్ -19 వ‌ల్ల ప్లాన్ మారింద‌ని తెలిపారు . నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాన‌ని ర‌ణ‌బీర్ అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అలియా - రణ్ బీర్ మొదటిసారి బ్రహ్మాస్త్రలో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- మౌని రాయ్ -నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఆలియా త‌దుప‌రి గంగుబాయ్ కథియావాడి చిత్రంలో న‌టిస్తోంది. RRR తో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. డార్లింగ్స్ - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.
రణబీర్ కపూర్ షంషేరా .. యానిమ‌ల్ అనే రెండు భారీ చిత్రాల్లోనూ న‌టిస్తున్నాడు.

దూసుకెళుతున్న సందీప్ వంగా..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ యానిమ‌ల్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇంత‌కుముందు ప్ర‌క‌టించిన `డెవిల్` టైటిల్ ని మార్చి `యానిమ‌ల్` అని ప్ర‌క‌టించారు. అయితే టైటిల్ మార్చ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే.. స‌ల్మాన్ వ‌ల్ల‌నేన‌ని తెలిసింది. డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా స‌ల్మాన్ కోసం రిజిస్టర్ చేయించ‌డంతో దీంతో టైటిల్ మార్చాలని సందీప్ వంగా అండ్ మేకర్స్ నిర్ణయించారు. ఇది మోటైన గ్యాంగ్ స్టర్ డ్రామా .. నిర్మాతలు భూషణ్ కుమార్ - మురాద్ ఖేతానీ భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. యానిమల్ ‌కు ముందు రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ ‌తో కలిసి నటించిన `లవ్ రంజన్` పెండింగ్ పనిని పూర్తి చేసాడు. ఇది దిల్లీ- ఘజియాబాద్- నోయిడాలో .. తరువాత విదేశాలలో చిత్రీకరించారు.

2019 లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ వంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. షాహిద్ కపూర్-నటించిన ఈ చిత్రం విమ‌ర్శ‌ల న‌డుమ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు వ‌సూలు చేసింది. ఇది షాహిద్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓవ‌ర్ నైట్ స్టార్ డమ్ తెచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయిన అర్జున్ రెడ్డితోనూ టాలీవుడ్ లో స‌త్తా చాటాడు. త‌దుప‌రి `యానిమ‌ల్`తో మ‌రోసారి బాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అలాగే సందీప్ వంగా ఓటీటీ కోసం ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.