Begin typing your search above and press return to search.

అనుష్కలో శ్రీదేవిని చూపిస్తున్న కుర్రాడు

By:  Tupaki Desk   |   16 Sep 2016 4:43 AM GMT
అనుష్కలో శ్రీదేవిని చూపిస్తున్న కుర్రాడు
X
రిషి కపూర్-శ్రీదేవి జంటగా చాందినీ అంటూ 1989లో వచ్చిన సినిమాలోని.. టైటిల్ సాంగ్ ను కపూర్ ఫ్యాన్స్ ఎవరూ మర్చిపోలేరు. 'రంగ్ భరే హై బాదల్ సే' అంటూ సాగే ఈ రొమాంటిక్ నెంబర్ లో.. రిషి-శ్రీదేవిలు పండించిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఈ పాటలో శ్రీదేవి కాస్ట్యూమ్స్ కూడా బాగా పాపులర్.

యెల్లో కలర్ షిఫాన్ శారీలో.. స్లీవ్ లెస్ జాకెట్ తో శ్రీదేవి-రిషిల మధ్య సాగే 'చాందినీ .. ఓ మేరె చాందినీ' పాటలో శ్రీదేవితో తండ్రి రిషి చేసిన మ్యాజిక్ ను.. రీక్రియేట్ చేస్తున్నాడు కొడుకు రణబీర్ కపూర్. ఏ దిల్ హై ముష్కిల్ మూవీని కరణ్ జోహార్ దర్శకత్వంలో చేస్తున్న రణబీర్.. సేమ్ డిట్టో చాందినీ గెటప్పులు-డ్రెసింగ్- లొకేషన్స్ తో ఓ పాటను సెట్ చేశాడు. ఆ సినిమాలో శ్రీదేవి నటిస్తే.. ఇక్కడ అనుష్క శర్మకు దాదాపు అలాంటి గెటప్ నే వేశారు. జస్ట్ హెయిర్ స్టైల్ మాత్రం ఈ జనరేషన్ కు తగ్గట్లుగా ఉందంటే.

తండ్రిలా ఒదిగిపోవడం రణబీర్ కు పెద్ద కష్టం కాదు. పైగా ఉలెన్ స్వెటర్ తో దాదాపు తండ్రి కనిపించినట్లుగానే ఉండేందుకు ట్రై చేశాడు. లొకేషన్ విషయంలో అయితే దింపేశారంతే. మొత్తానికి యే దిల్ హై ముష్కిల్ మూవీతో.. పాత చాందినికి రణబీర్- అనుష్క శర్మ- కరణ్ జోహార్ లో ట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నారని చెప్పచ్చు.