Begin typing your search above and press return to search.
క్యూట్ కపుల్ బ్రేకప్ దెబ్బకి కోట్ల నష్టం
By: Tupaki Desk | 29 Feb 2016 6:14 AM GMTరణ్ బీర్ కపూర్- కత్రినా కైఫ్... బాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకుని.. తీరా చివరకు బ్రేకప్ చెప్పేసుకున్న జంట సాధారణంగా ఇలాంటి బ్రేకప్ తర్వాత.. లైఫ్ లో కొంత డిస్టర్బెన్స్ సహజం. మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ జంట విషయంలో మాత్రం మెంటల్ టెన్షన్ తో పాటు ఎకనమిక్ గానూ నష్టపోవాల్సి వచ్చింది. కత్రినా కైఫ్-రణ్ బీర్ కపూర్ లతో కలిపి ఉమ్మడిగా యాడ్ చేయాలని ఓ కంపెనీ గతంలో డిసైడ్ అయింది.
ఇప్పటికే సైఫ్ ఆలీ ఖాన్-కరీనా కపూర్ లతో జంటగా చేస్తున్న షాంపూ యాడ్ ఇది. వీరిద్దరి ప్లేస్ లో రణ్ బీర్-కత్రినాలతో రీప్లేస్ చేయాలని అనుకున్నారట. ఈ డీల్ గురించి మాటలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడంతో.. ఇప్పుడు ఆ యాడ్ ప్రతిపాదనను డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు రణ్ బీర్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా.. కొత్తగా కేట్ తోనే సైన్ చేయించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రతిపాదనను డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఈ జంటకు కలిసి ఉన్నపుడు ఉన్నంత బ్రాండ్ వాల్యూ.. విడిపోయిన తర్వాత ఉండదని కంపెనీ భావించింది.
మరి రణ్ బీర్ తో యాడ్ అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తూ.. కేవలం కత్రినా దూరంపెట్టాలనే ఉద్దేశ్యంపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. కంపెనీలు పని చేసేదే లాభాపేక్షతో కాబట్టి ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోరు. మరోవైపు కత్రినా-రణ్ బీర్ లతో చేసేందుకు తలపెట్టిన జగ్గా జాసూస్ కూడా ఇబ్బందుల్లో పడింది.