Begin typing your search above and press return to search.

ఐపీఎల్ క్లోజింగ్ లో మాజీ లవర్స్ రచ్చ?

By:  Tupaki Desk   |   23 May 2018 5:09 AM GMT
ఐపీఎల్ క్లోజింగ్ లో మాజీ లవర్స్ రచ్చ?
X
ఇండియాలో బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ గా ఐపీఎల్ అవతరించి చాలాకాలమే. కాకపోతే ఇదేమీ గవర్నమెంట్ వ్యవహారం కాదు కాబట్టి.. అలాంటి బిరుదులు ఏమీ రావంతే. ఇప్పుడు ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్ కి చెన్నై జట్టు చేరిపోయింది కూడా. రెండో ప్లేస్ ఎవరిదో తేలేందుకు ఇంకా రెండు మ్యాచులు పడుతుంది.

ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్.. ఇక ముగింపు వేడుకలే. ఆరంభవేడుకలను మించి ఈ క్లోజింగ్ సెరమనీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా.. బాలీవుడ్ స్టార్స్ ను.. స్పెషల్ పెయిర్స్ గా మార్చి.. క్లోజింగ్ ఈవెంట్ చేయనున్నారట. రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్.. ఓ ఏడాది క్రితం వరకు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో తెలిసిన విషయమే. ఇప్పుడు వీరిద్దరితో లైవ్ పెర్ఫామెన్స్ ఇప్పించేందుకు ప్లాన్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. రియల్ లైఫ్ లో విడిపోయిన వీరిద్దరు.. స్టేజ్ పై ఎలా సందడి చేయనున్నారనే సంగతి మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. అయితే.. విషయం ఏంటంటే.. వీరిద్దరూ విడివిడిగా ప్రదర్శనలు చేయనున్నారు.

రణబీర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు సందడి చేయనుండగా.. కత్రినా కైఫ్ ఓ మెడ్లేకు డ్యాన్స్ చేయనుంది. ఇక కత్రినాకు మరో మాజీ లవర్ అయిన సల్మాన్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పెర్ఫామ్ చేయనున్నాడు. కరీనా కపూర్.. కార్తిక్ ఆర్యన్.. సోనమ్ కపూర్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ ఈవెంట్ లో డ్యాన్సులను చేసి అలరించనున్నారు.