Begin typing your search above and press return to search.

అసోసియేషన్ కి సారీ చెప్పిన యంగ్ హీరో

By:  Tupaki Desk   |   17 Jun 2016 6:36 AM GMT
అసోసియేషన్ కి సారీ చెప్పిన యంగ్ హీరో
X
బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ ఇప్పుడు సినిమాలతోనే కాదు.. తన సొంతింటి పనుల విషయంలో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను పాతిక కోట్లతో కొన్న ఫ్లాట్ ను రీమోడల్ చేయించుకుంటున్నాడు. ఇదే సమయంలో ఈ ఫ్లాట్ కి దగ్గరలోనే సొంతింటిలో ఉన్న రిషి కపూర్ కూడా తన ఇంటిలో కీలక మార్పులు చేయించుకుంటున్నాడు.

తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకేసారి రీమోడలింగ్ చేయించుకుంటూ ఉండడం.. ఇరుగు పొరుగుకు ఇబ్బందిగా మారింది. రిషికపూర్ వరకు అయితే.. ఏ మాత్రం రిస్క్ లేకుండా.. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడని అంటున్నారు. ఒకసారి సమాచారం ఇచ్చాక పాలి హిల్ రెసిడెంట్స్ అసోసియేషన్ రూల్స్ అనుగుణంగానే నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నాడట. కానీ రణబీర్ కపూర్ విషయంలోనే ఇబ్బంది తలెత్తతోంది. అర్ధరాత్రి వరకూ డ్రిల్లింగ్ శబ్దాలు - కన్ స్ట్రక్షన్ మిషన్స్ చేస్తున్న సౌండ్స్ తో ఇబ్బందిగా ఉందంటూ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

కంప్లెయింట్ రావడంతో రణబీర్ కపూర్ కి స్పందించక తప్పలేదు. అర్ధరాత్రి వరకూ వర్కర్లు పని చేస్తున్నట్లు తనకు తెలీదని.. రాత్రి 7.30కల్లా పనులు ఆపేయమని చెబుతానని.. అసౌకర్యానికి చింతిస్తున్నా అంటూ అసోసియేషన్ వర్గాలకు సారీ చెప్పాడట రణబీర్ కపూర్. ఎంత హీరోలయినా.. తాము మనుషులమే అనే విషయం మర్చిపోతే చివరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది.